| << Newer | Post Comments | Older >> |
ఏయీమ్స్ డైరెక్టర్‌గా వేణుగోపాల రావును వెంటనే తిరిగి నియమించాలంటు సుప్రీం కోర్ట్ జారీచేసిన ఆదేశాల ప్రతి ఇంకా తమకు అందలేదని కేంద్ర మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. తీర్పు ప్రతి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పడం ఇదే మొదటి సారి. వేణుగోపాల రావును బలవంతంగా డైరెక్టర్ పదవి నుంచి తప్పించడానికి గాను ఏయీమ్స్ చట్టాన్ని గత ఏడాది పార్లమెంట్ సవరించింది. ఏయీమ్స్ డైరెక్టర్ పదవి కాలాన్ని 65 ఏళ్లకు కుదించడం లో విజయం సాదించిన కేంద్ర మంత్రి రాందాస్ ఆ సవరణను అడ్డు పెట్టుకొని వేణుగోపాలరావును బైటికి పంపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఏయీమ్స్ కు సంబందించి న చట్టాని సవరించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాలరావు సుప్రీం కోర్ట్ లో కేసు ధాఖలు చేశారు. దానిపై వాద ప్రతివాదాలు విన్న సుప్రీం కోర్ట్ కేసు పూర్వా పరాలను పరిశీలించి వేణుగోపాలరావును తిరిగి ఏయీమ్స్ డైరెక్టర్ గా నియమించాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఏయీమ్స్ వ్యవహారం లో కలగచేసుకోరాదని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడం జరిగింది.


