Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/6/25 8:06:32

తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరిగా తనకు తాను బావిస్తున్న ఎం. ఎల్. ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పార్టీ నేతలు చూపు సారించారు. తనను అందలం ఎక్కిస్తారని ఆయన అనుకుంటే పొరపడినట్లే. తెలుగు దేశం పార్టీలో సంక్షోభానికి కారకుల్లో ఒకరైన శ్రీనివాస యాదవ్ ను కట్టడి చేయక పోతే పార్టీ మరింత కష్టాలను ఎదుర్కుంటుందని పార్టీ ముఖ్య నేతలు బాబుకు సూచించారని సమాచారం. తెలంగాణా ప్రాంత ప్రజల నమ్మకాన్ని చూరగో నడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తున్న తరుణం లో తలసాని చేసిన సమైక్య వాద ప్రకటన పార్టీని ఇరకాటం లో పెట్టింది. ఉప ఎన్నికల ప్రచారం లో పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, సానుకూలంగా ఉందని చంద్రబాబు చెప్పడం తో తెలంగాణా ప్రాంత ప్రజలలో పార్టీ పట్ల నమ్మకం కలుగుతుందని ఆశిస్తున్న తరుణం లో ఫలితాలు వెలువడిన తరువాత పార్టీ సమైక్య వాడానికి కట్టుబడి ఉన్నట్లు తలసాని చెప్పడం తో పార్టీ ఇరకాటం లో పడింది. తెలంగా ప్రాంతం లో పార్టీని పటిష్ట పరచడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆ ప్రకటన వల్ల విఘాతం కలిగిందని చెప్పాలి. తెలంగాణా ప్రాంతం పై అధ్యయనం చేయడానికి ఐదుగు రూ సభ్యులతో కోర్ కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన తరువాత కూడా బాబు తో చర్చించ కుండా తలసాని తొందరపడి చేసిన ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఆది చివరకు దేవేందర్ గౌడ్ పార్టీ వీడి వెళ్లే దానికి దారి తీసింది. గౌడ్ లాంటి సీనియర్ నేత పై శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శలు పార్టీ పైన కూడా ప్రభావాన్ని చూపింది. పార్టీలోని తెలంగాణా వాదులంత ఒక్కటై పార్టీని వదిలి వెళ్లే దాకా వెళ్ళింది. చంద్రబాబు వెంటనే రంగం లోకి దిగి నష్టాన్ని నివారించడానికి ప్రయత్నం చేసే లోగా గౌడ్, పెద్దిరెడ్డిలు పార్టీనుంచి వెళ్ళిపోయారు. మిగిలిన వారిని మాత్రం పార్టీ అతి కష్టం పై ఆపగలిగింది. ఇంతటికీ మూలకారకుడైన శ్రీనివాస యాదవ్ ను కట్టడి చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. లేక పోతే తెలంగాణప్రాంతం నుంచి వలసల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికైనా జాగ్రత పదాలనుఇ బాబు నేతలకు సూచించారని తెలిసింది.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • కోటా వ్యవస్థకు స్వస్తి
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • వామ పక్షాల మధ్య విభేదాలు సమిసీనా !
  • బావకు బాసటగా బాలయ్య
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • బలోపేతానికి చర్యలు
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • చిరు వ్యతిరేకులకు కాంగ్రెస్ వల
  • బి. జె. పి. నుంచి 'చిరు' కు ఆహ్వానం
  • అగ్ని ప్రమాదం
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • Latest News
  • చెరోదారిన జొదెద్దులు..?
  • మహేష్ బాబు, భూమిక హేట్రిక్..
  • తందానా 'తానా'
  • జీవిత వర్సెస్ గంగా భవాని
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • టి. డి. పి. లో ఆనిశ్చిత
  • తెలంగాణవైపే మొగ్గు!
  • నానో వచ్చెనా..?
  • మంత్రులే ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు...
  • చర్చలు సానుకూలం
  • లక్ష్యం ఒకటే --దారులు వేరు
  • నచ్చ క పోయినా తప్పదుగా
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • రాష్ట్రానికి నానో ప్రాజెక్ !
  • పకోడీ చర్చలు..
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |