| << Newer | Older >> |
on 2008/7/15 18:15:32
తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు ఈ నెల 20 వ తేదీన డిల్లీ వెళ్లనున్నారు. కేంద్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న కె. సి. ఆర్ యు. పి. ఏ. కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి దాదాపుగా నిర్ణయించుకున్నారు. విశ్వాస పరీక్షకు అనుకూలంగా నైనా, వ్యతిరేకంగా నైనా తాము ఓటు చేయడానికి తమకున్న ఒకే ఒక కారణం తెలంగాణా అంశమని కె. సి. అర్.చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రధాని తెలంగాణా పై అధికార ప్రకటన చేస్తే విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. కు అనుకూలంగా ఓటు వేస్తామని కె. సి. ఆర్. గతం లో చెప్పారు. అయితే కాంగ్రెస్ దానికి స్పందించక పోవడం చిన్న పార్టీల కూటమి ద్వారా తన డిమాండ్ ను సాదించుకోవాలని అనుకున్నారు. ఆది కూడా ఫలిచే అవకాశం లేదని తేలడంతో ఇపుడు బి. ఎస్.పి. అధినేత్రి మాయావతి తో చర్చలు జరుపుతున్నారు. మాయావతి కూడా కె. సి. అర్.కు ఫోన్ చేసినట్లు సమాచారం. మాయావతి ద్వారా తెలంగాణా అంశం సాదించుకోడానికి గల అవకాశాలపై ఆమెను నేరుగా కలిసి చర్చించడానికి కె. సి.అర్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 20 వ తేదీన ఆయన డిల్లీ వెళ్ళి మాయావతి ని కలవనున్నారు. ఆమెతో మంతనాలు జరపనున్నారు. మాయావతి ఇపుడు యు. ఎన్. పి. ఏ. కూటమిలో చేరడానికి సుముకత చూపుతున్నారు. కె. సి. ఆర్. ను కూడా ఆమె తమ కూటమిలోకి ఆహ్వానించే అవకాశం లేక పోలేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



