| << Newer | Older >> |
on 2008/6/25 21:51:49
రాష్ట్ర ముఖ్య మంత్రి గురువారం ఉదయం డిల్లీ చేరుకున్నారు. ప్రధాని, సోనియా గాంధీల ఆపాయింట్‌మెంట్ దొరకడం తో ఆయన వారిని కలవడానికి డిల్లీ వచ్చారు. తిరిగి సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. ప్రధాని, సోనియాలతో పాటు ఆయన కేంద్ర మంత్రి శివరాజ్‌పాటిల్ ను కూడా కలవనున్నారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు వై. ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను కలవనున్నారు. సాయత్రం ఆరు గంటలకు ప్రధానితో ఆపాయింట్‌మెంట్ ఉంది. ఇక పనిలో పనిగా వై. ఎస్. కేంద్ర మంత్రి శివరాజ్‌పాటిల్ ను కలిసి ఏకీకృత సర్వీస్ లపై చర్చించనున్నారు అని తెలిసింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



