| << Newer | Older >> |
on 2008/7/23 8:09:04
నగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాథం ను తెలుగుదేశం పార్టీ వేలి వేసింది. యు. పి. ఏ. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస పరీక్షలో తెలుగుదేశం పార్టీ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాథం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీ టిక్కెట్ పై గెలిచిన మంద పార్టీ జారీ చేసిన విప్ ను దిక్కరించి విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేయడం పార్టీ ని వెన్నుపొటు పొడిచినట్లే నని పార్టీ అధినేత చంద్రబాబు బావించారు. పార్టీ పెంచి పోషించిన వ్యక్తులు పార్టీకి ద్రోహం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. మంద ప్రలోభాలకు లోను అయ్యారని, డబ్బుకు అమ్ముడుపోయారని కూడా పార్టీ అధినేత అంటున్నారు. స్వార్థ ప్రయోజనాలే ముఖ్య మనుకున్న వారిని ఉపేక్షించమని పార్టీ అంటోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




