| << Newer | Older >> |
on 2008/10/6 8:33:50
తెలుగుదేశం పార్టీలో ఆనిశ్చిత నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోడానికి సిద్దం అవుతున్నా పార్టీ పరిస్థితి లో పెద్దగా మార్పు వచ్చేలా కనిపించడం లేదు. అంతర్గత తగాదాలు. వర్గ పోరు కారాణాగానే పార్టీ నుంచి చాల మంది సీనియర్లు బైటకు వెళ్ళి ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాదించే అవకాశాలు కనిపించడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన వారు, చిరంజీవి పార్టీని పెట్టడం తో ఆయన ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ ఉంటుందని కొత్త పార్టీ కావడం పైగా సినీ గ్లామర్ వల్ల చిరు పార్టీకి రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయని బావించిన వారు టి. డి. పి. కి ఓ నమస్కారం పెట్టి వెళ్ళి పోతున్నారు. పార్టీని వదిలి వెళ్ళి పోతున్న వారు చెబుతున్న కారణాలు మాత్రం మరో రకంగా ఉంది. పార్టీ అధినేత వైఖరి లో మార్పు రాలేదని ,చెప్పుడు మాటలు వింటూ తమకు తగిన ప్రదాన్యత ఇవ్వడం లేదని అంటున్న వారు ఉన్నారు. చిరంజీవి పార్టీ పెట్టడం తో తమ హితులు, శ్రేయోభిలాశులు, పార్టీ కార్యకర్తలు తమ పై వత్తిడి తీసుకొని వస్తున్నారని యువత కూడా చిరంజీవి పై మొగ్గు చూపుతున్న కారణంగా తమ పై వత్తిడి పెరిగి తాము ఆ పార్టీలో కి వెళుతున్నామని చెబుతున్న వారు ఉన్నారు.
వలసల తో కూదెలవుతున్న పార్టీ పై ఇపుడు తెలంగాణా ప్రభావం కూడా పడింది. అనుకూల నిర్ణయం తీసుకొని పక్షం లో పార్టీ తెలంగాణా ప్రాంతం లో చాల నష్ట పోతుందని తెలంగాణా ప్రాంత నేతలు పార్టీ అధినేత కు పలు సందర్భాల్లో చెప్పడమే కాదు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకొని పక్షం లో తెలంగాణా ప్రాంతం లోని సీనియర్లు పార్టీని వదిలి వెళ్లే సూచనలు కనిపించడం, పైగా తెలంగాణా ప్రాంతం లో తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉండటం తో టి. డి. పి. తన విదానాన్ని మార్చుకొని తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోడానికి సిద్దపడింది.
పార్టీ కాస్త బలహీన పడటం, మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రభావం తో దిక్కుతోచని టి. డి. పి. మెగాస్టార్ స్టార్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వీధిలేని పరిస్థితుల్లో నందమూరి వారసులను రంగం లోకి దించాల్సి వచ్చింది. తమ తండ్రి స్థాపించిన పార్టీని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన నందమూరి వారసులు తమ అభిమానులకు పార్టీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నందమూరి వారసుల కోర్కేను తీర్చడం చంద్రబాబు కు ఇబ్బంది కరమె. అధికారం కోసం ఆరాట పడుతున్న చంద్రబాబు వామపక్షాలతో, టి. ఆర్. ఎస్. తో పొత్తులకు దిగితే వారికి కొన్ని సీట్లు కేటాయించాలి. నందమూరి వారసులకు మరి కొన్ని పోతే మిగిలిన సీట్లు పార్టీలోని వారికి కేటాయించాలి బి. సి. లతో పాటు అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అధినేతకు తలకు మించిన భారమే అవుతుంది. ఏ ఒక్క వర్గం అసంతృప్తి చెందిన ఆది అధినేతకు తలనొప్పిని తెస్తుంది . ఈ నేపథ్యం లో చంద్రబాబు ఈ పరిస్థితి నుంచి ఎలా బైట పడతారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



