| << Newer | Older >> |
on 2008/7/4 20:57:40
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం త్వరలో నిర్వహించాలని ఆ పార్టీ అదినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మీకోసం యాత్రలో బాబు బిజీ బిజీగా ఉన్నారు. దేశం లోను , రాష్ట్రం లోను వేగంగా మారుతున్న రాజకీయాలను గమనిస్తున్న టి. డి. పి. ముందు చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం లో రెండు పార్టీలు రానున్నాయి. అందులో చిరు పార్టీవల్ల పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని అంటున్నారు. మరోపక్క యు. ఎన్. పి. ఏ. లో చీలిక రావడం దాదాపు ఖాయమని తెలిపోయింది. వామపక్షల తో కలిసి అడుగు వేయాలని చంద్రబాబు బావిస్తూన్నారు. తెలంగాణాలో పార్టీ మరింత బలపడాలంటే టి. ఆర్. ఎస్. తో పొత్తు పెట్టుకోవాలనే వాదన పార్టీ లో మొదలైంది. దానికి టి. డి. పి. సై అంటే తాము బాబు తో కలవమని సి. పి. ఎం . తేల్చి చెప్పింది. బి. సి. ఓట్లను ఆకర్షించడానికి అధికార పార్టీ ఇప్పటికే ఓ. సి. లో ఉన్న పది కులాలను బి. సి. లో చేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది కూడా. టి. డి. పి. కి మొదటి నుంచి అండగా ఉన్న బి. సి. ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టడం తో ఆ పార్టీ కలవర పడుతోంది. ఇక మరోపక్క చిరు పార్టీ బి. సి. లను తన వైపు తిప్పుకోవడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యం లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ బావిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




