| << Newer | Older >> |
on 2008/7/5 6:16:04
తెలుగుదేశం పార్టీ కి మరో షాక్ తగిలింది. కర్నూల్ జిల్లాకు చెందిన భూమా దంపతులు శనివారం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కర్నూల్ జిల్లాలో ఒక బలమైన వర్గానికి నాయకుడైన భూమా గత 25 ఏళ్లుగా పార్టీలో ఉంటూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా భూమా దంపతులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాము పార్టీని వదిలి వెళుతున్నామని చెప్పిన భూమా దంపతులు తాము ఏ పార్టీలో చేరుతారన్నది మాత్రం చెప్పలేదు. వారు మెగాస్టార్ చిరంజీవి పెట్టనున్న పార్టీలోకి వెళ్ళ వచ్చునన్న వార్తలు వినిపిస్తున్న వారు మాత్రం ఆ విషయాన్ని నేరుగా చెప్పడం లేదు. అయితే వారి మాటలను బట్టి వారు చిరు పార్టీలో చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పార్టీలో తన ఏదుగుదలను ఓర్వలేని వారు అడుగడుగున అడ్డు తగులుతున్నారని భూమా వాపోయారు. శనివారం లో కర్నూల్ లో ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశం లో భూమా, ఆయన సతీమణి శోభ నాగిరెడ్డి ప్రసంగించారు. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని టి. డి. పి చెప్పడం గురించి ప్రస్తావిస్తూ వ్యక్తులు లేనిది పార్టీ ఎక్కడిదని ఎదురు ప్రశ్న వేశారు. పార్టీని నమ్ముకొని ఇంత కాలం తాము ఉన్నా తమకు అవమానాలు తప్ప మరేమీ ఒరగలేదని అన్నారు. అధికారం కోసం పార్టీలు మార్చడం తమ అభిమతం కాదని అందుకే పాతికేళ్లుగా పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. భూమా తో పాటు కటసానిరామిరెడ్డి, బుడ్దా శేషా రెడ్డి . ఎస్. వి. సుబ్బా రెడ్డిలు కూడా టి. డి. పి. కి గుడ్ బై చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



