| << Newer | Older >> |
on 2008/10/6 9:53:04
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్ష స్థానానికి రోజుకో పేరు వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు సినీ గ్లామర్ పై ఆదరపడుతున్నాయి. ఇప్పటికే టి. డి. పి. లో సినీ నటి రోజా తెలుగు మహిళా నాయకురాలిగా సమర్ద వంతమైన పాత్ర పోషిస్తున్నారు. టి. డి. పి. కి ధీటుగా తమ పార్టీలోను సినీ గ్లామర్ ఉన్న నటి జీవితను మహిళా విభాగం అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయాలని వై. ఎస్. వర్గం పట్టుబడుతోంది. ఒక ఎం. పి. సిఫార్స్ చేసిన శారద పేరు తెరపైకి వచ్చింది. శారద కన్నా సినీ నటి జీవిత ను ఎంపిక చేయడం అన్నిరకాలుగా మంచిదని కె. వి. పి. సూచించారు. ఇపుడు జీవితకు పోటీగా తెరపై గంగా భవాని పేరు వినిపిస్తోంది. గంగా భవాని గతం లో పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. జీవితకు ఆ అనుభవం లేదు. వై. ఎస్. వర్గం మాట చెల్లు బాటు కాకుండా చూడటానికి వై. ఎస్. వ్యతిరేక వర్గం గంగా భవాని పేరును తెరపైకి తీసుకొచ్చింది. జీవిత కు రాజకీయ అనుభవం లేదని వై. ఎస్. వ్యతిరేక వర్గం వాదన. గంగా భవాని జీవిత కన్నా ధాటిగా మాట్లాడగలరు. పైగా దాడి, ఎదురుదాడి లో ఆమె అరితెరారు. జీవిత కన్నా గంగా భవాని బేటర్ అని వాదిస్తున్నారు. వారిద్దరిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



