| << Newer | Older >> |
on 2008/9/19 22:39:57
చేనేత పరిశ్రమను ఆదుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీని స్థాపించిన తరువాత తొలిసారిగా మెగాస్టార్ తన రాజకీయ యాత్రను కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల లో ప్రారంభించారు. సిరిసిల్ల లోని చేనేత కార్మికులను పరామర్శించారు. చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఒక దీర్గ కాలిక ప్రణాళికను రూపొందించ నున్నట్లు చెప్పారు. చేనేత కార్మిక కుటుంబాలను పరామర్శించడానికి ముందు సిరిసిల్ల కు 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న టెక్స్‌టైల్స్ పార్క్ ను ఆయన ముందుగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని చూసి విస్తు పోయారు. అన్ని సౌకర్యాలతో పార్క్ ను అభివృద్ది చేస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిన విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్య పోయారు. చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకోడానికి ముందు చేనేత పరిశ్రమ పై తనకంటూ ఒక అవగాహన ఉండాలని బావించిన చిరంజీవి పార్క్ ను సందర్శించారు. సిరిసిల్ల, నేరెళ్ళ అసెంబ్లీ నియోజక వర్గాల్లో వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలుసుకొని చలించి పోయిన చిరంజీవి వారికి తాను, తన పార్టీ కొండంత అండగా ఉంటామని చెప్పారు. చేనేత కార్మికుల కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలను కూడా ఆయన కలిసి పలకరించారు. చిరంజీవి ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి కలవడం సిరిసిల్ల పర్యటనతో మొదలైంది. సిరిసిల్ల తో తన రాజకీయ పర్యటనకు శ్రీకారం చుట్టిన చిరంజీవి తన పర్యటనను ఎంత గోప్యంగా ఉంచినా ఆది అభిమానులకు తెలియని విషయం కాదు. తమ అభిమాన హీరో సిరిసిల్ల వస్తున్నారని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో గూమి కుడారు. వారిని అదుపు చేయడానికి చాలా కష్ట పడ్డ పోలీసులు ఒక దశలో స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది కూడా.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



