| << Newer | Older >> |
on 2008/9/18 9:38:29
రాష్ట్రం లో విశేష ప్రజాదరణ , విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ ను ఢీ కొనడానికి కాంగ్రెస్ పార్టీ చిరంజీవి వ్యతిరేకులను ఏకం చేసి ఆయన పై దాడికి ప్రయోగించడానికి వారి పై వల విసర డానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ లో చేరిన జీవిత రాజశేఖర్ లు చిరంజీవి పై ద్వజమెత్తారు. ఇక ఈ సారి చిరంజీవి తో విబేధాలున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ను మెగాస్టార్ పై ఉసి గోల్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ని ఎన్నికల్లో ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది.. చిరు వ్యతిరేకులందరిని సమీకరించి ఒక బలమైన శక్తిగా తయారుచేసి చిరంజీవి పై ప్రయోగించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో బాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు మోహన్‌బాబును కలిసి ఆయనతో చర్చలు జరిపి నట్లు తెలిసింది. తమ పార్టీలో చేరి చిరంజీవి కి వ్యతిరేకంగా పోటీ చేయడమో, లేదా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించడానికి సిద్ద పడితే తిరుపతి సమీపం లో అత్యంత విలువైన భూమిని దరాదత్తం చేస్తామని చర్చల సందర్భంగా ఆయనతో చెప్పారని వినికిడి. మోహన్ బాబు ఇలాంటి దానికి అంగీకరిస్తారో , లేదో తెలియదు. అయితే చూస్తూ చూస్తూ ఎవరైన విలువైన భూమిని కాలదన్ను కుంటారా! మోహన్ బాబు రూటే వేరు .ఆయన ఎం చేస్తారన్నది వేచి చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



