| << Newer | Older >> |
on 2008/7/10 21:02:36
రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త శకానికి శ్రీకారం చుట్టాలని ఆశిస్తున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. వచ్చే నెలలో చిరు రాజకీయ అరంగ్రేటం ఖాయమన్న డి వెల్లడైంది. ఇపుడు చిరు ను పట్టి పీడిస్తున్న ప్రధాన అంశం ఒక్కటే, అదే తెలంగాణా. తెలంగాణా అంశం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవాల, సమైక్య వాదాన్ని వినిపించాలా అన్నది చిరంజీవి తేల్చుకోలేక పోతున్నారు. తెలంగాణా పై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనుకున్నా ఆది ఇపుడు సాధ్యం కాదని తెలిసింది. దాంతో ఎస్. ఎం .ఎస్. ల ద్వారా తెలంగాణా పై అభిప్రాయ సేకరణ జరపాలని చిరు శిబిరం నిర్ణయించింది. దానికి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణా చిక్కుముడిని చిరు ఎలా విప్పుతారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



