| << Newer | Older >> |
on 2008/10/9 8:53:53
తనకు జోతిష్యంపై కాని అదృష్ట సంఖ్య పై గాని నమ్మకం లేదని ప్రజారాజ్యం పార్టీ అదినేత బైటికి చెప్పినా ఆయన మాత్రం సెంటిమెంట్ ను వదులుకోలేక పోతున్నారు. విజయదశమి రోజున చిరంజీవి ప్రారంభించిన చిరంజీవి కి చాలా సెంటిమెంట్ ఉందని మరో సారి తెలిపోయింది. విజయాన్ని అందించే విజయదశమి రోజున తలపెట్టిన ఏ కార్యక్రమమైన తప్పక విజయాన్ని చేకూరుస్తుందని ఆయన నమ్ముతున్నారు. పైగా జోతిష్కూలు కూడా విజయదశమి రోజున యాత్రను ప్రారంభించాలని సూచించారంట. చిరంజీవి జాతకాన్ని పరిశీలించి వారు చెప్పడం తో చిరంజీవి దానికి సమ్మతి తెలిపారని తెలిసింది. వాస్తవానికి గాంధీ జయంతి రోజున చిరంజీవి యాత్ర చేపట్టాల్సి ఉంది. అయితే జోతిష్కూల తో పాటు కుటుంబ సభ్యులు కూడా గాంధీ జయంతి రోజుకన్నా విజయదశమి మంచిదని ఆయనకు సూచిచడం తో ఆయన దానికి సమ్మతించారని తెలిసింది. తన ప్రజా అంకిత యాత్ర తో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని చిరంజీవి బలంగా నమ్ముతున్నారు. తన యాత్ర సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు ప్రజారాజ్యం పార్టీ లో చేరుతారని ఆయన బావిస్తూన్నారు. చిరంజీవి ఎన్ని అనుకున్న ఆయన పర్యటన పై ప్రజా స్పందన ఎలా ఉంటుందన్నది చాలా కీలక మైనది. యాత్రలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవి ప్రజలను ఎలా ఆకర్షిస్తారో చూడాలి. చిరు యాత్రకు వచ్చీన వారంతా ఆయన పార్టీ కి ఓట్లు వేస్తారా? లేదా ఆయనలో సినీ నటుడిని మాత్రమే చూస్తారా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు పడుతుంది. సినిమా నటుడి నుంచి రాజకీయ నేత గా మారిన చిరంజీవి ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతారన్నది ఆయన మూడు రోజుల పర్యటనతో ఒక అవగాహన రావడానికి ఆస్కారముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



