| << Newer | Older >> |
on 2008/9/22 7:21:47
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన జిల్లా పర్యటనలను ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని చిరంజీవి సోమవారం మీడియాతో అన్నారు. తన జిల్లా పర్యటనలకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. కరీం నగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికుల స్థితి గతులు స్వయంగా విని చలించి పోయానని పేర్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనానికి రిటైర్డ్ ఐ. ఏ. ఎస్. అధికారి మూర్తి ఆద్వర్యం లో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నామని అన్నారు. కమిటీ చేనేత కార్మికుల సమస్యలు, చేనేత పరిశ్రమ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై అధ్యయనం చేసి నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. తన పై చేస్తున్న వ్యక్తి గత విమర్శలకు తాను స్పందించ నని మరోసారి చిరంజీవి స్పష్టం చేశారు. తల్లి తెలంగాణా పార్టీ అధినేత్రి విజయ శాంతి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రోజా లు ఆదివారం చిరంజీవి పై వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



