| << Newer | Older >> |
on 2008/6/12 19:33:30
వారిద్దరూ బావ బావ మరుదులు అంతాకు మించి మంచి మిత్రులు ఒకరిది ఆలోచన అయితే మరొకరిది అచరణ సినిమా పరిశ్రమకు చెందిన వారిద్దరూ ఇప్పాటేకే అన్నో సంచలా విజయాలు సాదించారు. తాజాగా రాజకీయ రంగం లోను తమ ప్రతాపం చూపడానికి సమర శంఖాన్ని పూరించనున్నారు. వారు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, ఆయన బావ మెగా నిర్మాత అల్లు ఆరవింద్. ఎవరి అండ లేకుండా సినీ పరిశ్రమలో పాదం మోపీ స్వశక్తి తో ఎదిగిన చిరంజీవి సినీ పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఒక వ్యక్తిగా ముందుకు అడుగెస్తూ ఆచంచలా విశ్వాసంతో అంచెలంచెలుగా ఒక వ్యవస్థ గా చిరంజీవి ఎదిగారు. ఈ ఏదుగుదలలో ఆయనకు మంచి మిత్రుడిగా చిరంజీవి హితాన్ని కోరుకోనే ఓ మంచి మిత్రుడిగా అల్లు చేదోడు వాదోడుగా నిలిచారు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడం కూడా వారిని మరింత దెగ్గరకు చేర్చాయి. ఒకరి అనుబవాలను మరొకరు పంచుకొంటూ తమెంచుకున్న రంగం విజయ బావుటా ఎగురవేస్తున్న చిరు, అల్లు లు తాము వేర్వేరు కాదని ఒక్కరామే అని పలు సందర్బాల్లో నిరూపించారు. సినీ రంగం లో సంచలన విజయాలను కైవసం చేసుకున్న వారిద్దరూ ఇపుడు రాజకీయ రంగం లోను సృస్టించాలని ఆశిస్తున్నారు. అంతర్లీనంగా సాగే గంగా ప్రవాహం లాంటి చిరు ఆలోచనలను నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ఆవిష్కరించే పని అల్లు ఆరవింద్ ది .సినిమా రంగం లోనే కాదు సామాజిక రంగం లోను వారిద్దరూ ఎన్నో ఘన విజయాలను సాదించారు. తాజాగా రాజకీయ రంగం లోను కొత్త చరిత్ర సృస్టించడానికి సమాయత్త మౌథున్నరు.సమజమ్ లో పేరుకుపోయిన అవినీతి, అన్యాయం, దుర్మర్గాల ఆట కట్టించడానికి వారిద్దరూ సమరాన్ని సాగించనున్నారు. దానికి రాజకీయరంగాన్ని ఎంచు కున్నారు. చిరు , అల్లుల రాజకీయ రైలు బోగీలను రూపొందిచడం లో వారిద్దరూ చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఒకరి ఆలోచనలను మరొకరు అమలు చేస్తూ రాజకీయ జైత్ర యాత్రకు సన్నద్దం అవుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



