| << Newer | Older >> |
on 2008/10/13 2:44:35
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నాయకుల్లో తెలంగాణా అంశం పై అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఉన్నా ఎవరికి వారు జంకుతున్నారు. మనసులో మాటను గట్టిగా బైటికి వ్యక్తం చేయలేక పోతున్నారు. ఒకరిద్దరు తెలంగాణా రావాలని ఉందని అన్న దాని పై గట్టిగా నిలబడలేక పోతున్నారు. ముఖ్యమంత్రి అభివృద్ది అంటూ జపం చేస్తూ వస్తున్నారు. ఉప ఎన్నికల్లో, దానికి ముందు కూడా తెలంగాణా వాదం బలహీన పడిపోయిందని, కొందరు మాత్రమే తెలంగాణా కావాలని పట్టుబడుతున్నారని సమైక్యవాదంతోనే ముందుకు వెళ్ళాలని వై. ఎస్. గట్టిగా వాదించారు. పార్టీ డిల్లీ లో జరగనున్న సమావేశం లో పాల్గొనడానికి వెళుతున్న ముఖ్యమంత్రి అక్కడ సోనియా గాంధీ వద్ద తెలంగాణా అంశాన్ని ప్రస్తావించే అవకాశ ముంది. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రం లో కాంగ్రెస్ ను తిరిగి అధికారం లోకి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన సోనియాగాంధీ కి కచ్చితంగా చెప్పవచ్చునని తెలిసింది. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అవకశవాదమని వై. ఎస్. సోనియాకు వివరించనున్నారు. తెలంగాణకు అనుకూలంగా టి. డి. పి. నిర్ణయం తీసుకున్నా విపక్ష పార్టీల్లో ఐక్యత లేదని ఆది తమకు ప్లస్ అవుతుందని చెప్పనున్నారు.
వై. ఎస్. అభిప్రాయం ఎలా ఉన్న టి. డి. పి. నిర్ణయం తో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణా విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జుత్తు పిక్కుంటోంది. తెలంగాణా విషయం తమ వైఖరిని ఇదివరకే స్పష్టంగా చెప్పినట్లుముఖ్య మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర మంత్రి బొత్స ఏమో తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరుడు గట్టిన సమైక్య వాది చంద్రబాబు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నపుడు కాంగ్రెస్ కూడా ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీ లో తీర్మానం చేయడమే మంచిదని చెబుతున్నారు. ఆయన తన అభిప్రాయాన్ని మంత్రిగా వ్యక్తం చేశారో, వ్యక్తి గత అభిప్రాయామో తెలియక పోయిన మొత్తానికి కాంగ్రెస్ లో ను తెలంగాణా ప్రకంపనలు మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాత్రం వై. ఎస్. పాటే పడుతున్నారు. తెలంగాణా పై తుది నిర్ణయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కి అప్పగించామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా పార్టీ అధిష్టానవర్గం తెలంగాణా పై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ తీర్మానం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రి అభిప్రాయం తో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది ఏకీభవించడం లేదు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ వాదులు మాత్రం టి. డి. పి. నిర్ణయం వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి గట్టి దెబ్బ తగులుతుందని వాదిస్తున్నారు. తెలంగాణా పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినేత్రి సోనియా నే నని ఒప్పుకొంటున్నారు. తెలంగాణాపై ఏకాభిప్రాయ సాధన పేరిట గత నాలుగున్నరేళ్లుగా సాగదీసిన కాంగ్రెస్ పార్టీ దానిని గురించి ఎలాంటి నిర్ణయానికి రాకుండానే మధ్యలో రెండో ఎస్. ఆర్. సి. ని తెరపైకి తెచ్చింది. అయితే అదికూడా ఆట కెక్కింది. ఇపుడు మళ్లీ ప్రణబ్ కమిటీ అని అంటోంది. తెలంగాణా విషయం లో కాంగ్రెస్ పార్టీకే ఇప్పటిదాకా స్పష్టత లేదన్నది తేటతెల్ల మైంది. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణా విషయం లో ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో ఇప్పటికే అర్థం అయిపోయింది. ఆటో, ఇటో తెలుచుకోక పోతే కాంగ్రెస్ తెలంగాణప్రాంత ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదనిపిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



