Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/10 7:45:17



రాజకీయాల్లోకి రావడం గొప్ప కాదు వచ్చిన తరువాత తాను ఉన్న పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి అందరితో కలిసి మేలిసి సాగడం ముఖ్యం. పార్టీ నిర్ణయాలను గౌరవించాలి. పార్టీ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించినా ఆది తనకు ముప్పుగా పరిగణించకుండా చూసుకోవాలి. స్థానిక నేతలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. 2004 లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి ఎన్నిక అయ్యేదాకా మధుయాష్కీ ఎవరో ప్రజలకు తెలియదు. ప్రజలదాక ఎందుకు నియోజక వర్గం లోని పార్టీ నేతలకు కూడా ఆయన ఎవరో కూడా పెద్దగా తెలియదు. విదేశాల్లో ఉండి స్వదేశం పై ప్రేమ తో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్ పై ఎన్నికైనా మధుయాష్కీ తన నాలుగేళ్ళ ఎనిమిది నెలల పదవి కాలం లో అటు తన పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని ఎం. ఎల్. ఎ.ల నుంచి ఇటు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒక్కసారి ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణా విషయం లో మధు అనుకూలంగా వ్యవహరించడం ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టిందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. తెలంగాణాను సమర్దిస్థు ఆయన చేసిన ప్రసంగాలు, వినిపించిన వాదనలు ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. తన నియోజక వర్గ ప్రజలతో, నేతలతో ఆయన మంచి సంబంధాలను నేరప లేక పోయారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. కాంగ్రెస్ పార్టీలో ఐ. ఏ. సి. సి. కార్యదర్శి గా ఉన్న మధు వేసిన కొన్ని తప్పు టడుగులు ఆయనకు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక పక్క ముఖ్యమంత్రి వై. ఎస్., మరోపక్క పి. సి. సి. చీఫ్ డి. శ్రీనివాస్ లు, పార్టీ నేతలు, ఎం. ఎల్. ఏ. లూకూడా మధు పై ఆగ్రహంగా ఉంటున్నారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయనకు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడానికి కారణ మౌతున్నాయి. ఎం. పి. లాడ్స్ పనులు పెండింగ్ లో ఉండటానికి కొందరు నేతలే కారణమని ఆయన చేసిన విమర్శను పార్టీ సీరియస్ గా తీసుకుంది. పనులు జరగక పోతే జిల్లాకు నష్టం అని తనకు కాదని ఆయన చేసిన వ్యాఖ్య కూడా పార్టీకి ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రజా ప్రతినిది గా ఎన్నికైన వారు ఎవరైన తన నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎం. పి. లాడ్స్ కింద మంజూరైన పనులు పూర్తి కావాలంటే తన నియోజక వర్గ ఎం. ఎల్. ఏ. ల సహకారం చాలా అవసరమన్న విషయం ముందు మధు గ్రహించాలి. మొదట్లో అన్ని వర్గాలవరిని కలుపుకొని వెళ్ళిన మధు ఆ తరువాత కొందరిని మాత్రమే చేరదియడం మిగిలిన వారికి ఆగ్రహాన్ని తెప్పించడం సహజం. స్థానిక నేతలు తనకు ఎందుకు సహకరించడం లేదో మధు ఒకసారి ఆలోచించి వారితో మాట్లాడి సర్దుబాట్లు చేసుకొని ఉంటే ఇ సమస్య వచ్చేది కాదు. పార్టీలో తన స్థాయిని పెంచుకోడానికి ఆయన చేసిన ప్రయత్నం లో జరిగిన కొన్ని పొరపాట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి. రానున్న ఎన్నికల్లో తిరిగి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ఆశిస్తున్న స్థానిక నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్న కారణంగా ఆయనకు నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం లభించక పోవచ్చు. తమకు అందుబాటులో లేని నేతవద్దని పలువురు అంటున్నారని సమాచారం. మధు వైఖరితో వై. ఎస్., డి. ఎస్. ఇద్దరు అసంతృప్తి తో ఉన్నారని వినికిడి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో మధుకు పార్టీ టికెట్ ను నిరాకరించిన ఆశ్చర్య పొనక్కర లేదు. రాజకీయాల్లో లౌక్యం చాలా ముఖ్యం. తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఆది చాలా అవసరం కూడా. మధు కు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా?అధిష్టన వర్గం స్థాయిలో ఆయన టికెట్ సాదించుకుంటారా? వై. ఎస్., డి. శ్రీనివాస్ లను కాదని ఆయనకు పార్టీ టికెట్ ఇస్తుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.





Related Stories:

  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • ముదురు తున్న వివాదాలు
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • వామపక్షా ల్లో కనిపిస్తున్న ఐక్యత
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • తృతీయ కూటమి పై చర్చలు
  • స్పీకర్ పదవి నుంచి సురేష్ రెడ్డి తప్పుకో
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • అవినీతి పైనే చిరు గురి
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • వామ పక్షాల మధ్య విభేదాలు సమిసీనా !
  • వివాదానికి కారణం ఏమిటి?
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • ఆయన దానికి పనికి రాడట..!?
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |