| << Newer | Older >> |
on 2008/10/5 7:01:26
టాటా మోటార్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా బావించిన నానో కార్ ప్రాజెక్ట్ పై ఐదుగురు సభ్యులతో కూడిన టాటా సంస్థ ప్రతినిది బృందం తో ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూల వాతావరణం లో జరిగింది. ప్రభుత్వం ఇవ్వ జూపిన రాయితీల పై టాటా ప్రతినిది బృందం సంతృప్తి చెందింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. రాసిన లేఖ తో నానో ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించడానికి టాటా ప్రతినిది బృందం ఆదివారం హైదరాబాద్ కు వచ్చింది. ముఖ్య మంత్రి తో సమావేశానికి ముందు ప్రతినిది బృందం రామచంద్రాపురం, ఆలేరు ప్రాంతాల్లో పర్యటించి స్థలాన్ని సందర్శించింది. ఆ తరువాత ప్రతినిది బృందం ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయం లో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపింది. టాటా మోటార్స్ సంస్థ అడిగినవన్ని సమకూర్చడానికి ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది విజయవాడ, అనంతపూర్ జిల్లాల్లో కూడా స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. కావాలంటే హైదరాబాద్ పరిసర ప్రాంతం లో కోరిన స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతించింది. అన్ని విన్న తరువాత ప్రతినిదిబ్రున్దమ్బృందం ఏమీ చెప్ప కుండానే వెనుదిరిగింది. ఇప్పటికే ప్రతినిది బృందం కర్నాటక మహారాష్ట్రాల్లో కూడా పర్యటించి చర్చలు జరిపింది. నానో విషయం లో ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవడం సాద్యం కాదని బృందం అభిప్రాయపడింది. తాము పర్యటించిన రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలతో జరిపిన చర్చల గురించి టాటా ఛైర్మన్ రతన్ టాటా తో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రతినిది బృందం తెలిపింది. ఈ సమావేశం లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గీతా రెడ్డి సంబందిత అధికారులు పాల్గొన్నారు. చర్చలు సానుకూల వాతావరణం లో జరిగిందని నానో ప్లాంట్ మన రాష్ట్రానికే వస్తుదన్న నమ్మకం తనకుందని మంత్రి గీతా రెడ్డి అన్నారు. ఇక నిర్ణయం టాటా సంస్థదే అని ఆమె చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



