| << Newer | Older >> |
on 2008/6/7 20:48:25
పెరిగిన గ్యాస్ ధరను తామే పూర్తిగా భారీస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి సంభందించిన జి. ఓ. ను విడుల చేసినా పాత ధరలకు గ్యాస్ మాత్రం సరఫరా కానీ పరిస్థితి నెలకొంది. పెట్రోలియం కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి తమకు ఆదేశాలు రణాంత కాలం పెంచిన ధరల ప్రకారమే తాము గ్యాస్ సీలెందర్ ను సరఫరా చేస్తామని డీలర్లు చెబుతున్నారు. పెరిగిన గ్యాస్ భారం తమ పై పడటం లేదని మహిళలు సంబర పడిన వారి సంతోషం కాస్త ఇప్పుడు ఆవిరి అయ్యింది. ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని మహిళలు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. జంట నగరాల్లో దాదాపు 54 మంది గ్యాస్ డీలర్లు ఉన్నారు. ఒక్కో డీలర్ ప్రతి రోజు రామారమి సగటున 55000రిఫ్ఫీల్స్ సరఫరా చేస్తారు. పెరిగిన రెట్ల ప్రకారం డీలర్లకు స్టాక్ వచ్చింది. అయితే కొత్త రేట్లతో గ్యాస్ సీలెందర్లను తీసుకోడానికి వినియోగదారులు తిరస్కరిస్థున్నరు.దన్థొ డీలర్లు అదే విషయాన్ని కంపెనీలకు తెలిపారు.కమ్పెనిలనుమ్చి సమాధానం వచ్చే వరకు సీలెందర్ల సరఫరాను నిలిపివేయాలని డీలర్లు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న అయోమయం నుంచి బైతపడాలంటే సరఫరాను నిపివివేయడం ఒక్కటే మార్గం అని వారు అభిప్రాయ పడ్డారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి డిళరల్‌కు ఆదేశాలు అందేవరకు డీలర్లు ఒకవేళ కొత్త రేట్లను అమలు పరిచి సీలెందర్లు సరఫరా చేసినా ప్రభుత్వం జారీచేసిన జి. ఓ. ను ఈ నెల 6 వ తేదీ నుంచి అమలు పరిచి అదనపు ఛార్జీలను తరువాత బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాడికారులు చెబుతున్నారు. ఆది అంత సులభంగా అవుతుందా? గోడకు కొట్టిన సు న్నం లాంటిదే పెరిగిన ధరల సర్దుబాటు అని వినియోగదారులు అంటున్నారు.
.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



