| << Newer | Older >> |
on 2008/7/10 7:20:32
తెలుగుదేశం పార్టీ నుంచి బైటకు వచ్చి తెలంగాణా ఉద్యమాన్ని బుజానికెత్తుకున్న దేవేందర్ గౌడ్ ఇపుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యారు. గత కొన్ని రోజులుగా పార్టీ ఏర్పాటు కోసం ఆయన కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటుకోసం ఒక సారి సన్నాహాలు చేసుకున్నా ఆషాడ మాసం కారణంగా వాయిదా వేసుకున్న దేవేందర్ గౌడ్ ఇపుడు అవన్నీ పక్కన పెట్టి పార్టీ ఏర్పాటు పై ప్రకటనకు సిద్దమయ్యారు. ఏ కార్యక్రమమైన ఆషాడం లో ఎవరు ప్రారంబించారు. శ్రావణ మాసం మంచిదని అంటారు. ఒక పక్క కేంద్రంలో యు. పి. ఏ ప్రభుత్వం మైనార్టీ లో పడటం, మరోపక్క విశ్వాస పరీక్షలో గనక ప్రభుత్వం ఓటమి పాలైతే పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు రావచ్చునని అనుకుంటున్న నేపథ్యం లో ఇక పార్టీ ఏర్పాటు లో జాప్యం కూడదని దేవేందర్ గౌడ్ బావించినట్లు ఉంది. పార్టీ పీరు జెండా, అజెండా గురించి శుక్రవారం ఆయన ప్రకటించనున్నారు. తెలంగాణా సాధనే తన ధ్యేయమని, ఉధ్యమమే ఉపిరని చెప్పిన దేవేందర్ గౌడ్ ఇపుడు రాజకీయ పార్టీని పెట్టి రాజకీయంగానే తెలంగాణాను సాదించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాదించాలని తెలంగాణా వాదులు దేవేందర్ కు సూచించారు. తెలంగాణా రాష్ట్ర సమితి తో కలిసి ఉద్యమని బలోపేతం చేయాలని కూడా తెలంగాణా వాదులు సలహా ఇచ్చినా దేవేందర్ దానిని పట్టించుకున్నట్లు లేదు. ఒకే లక్ష్య సాధన కోసం రెండు పార్టీలు పోరాడటం వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉంటుందో చూడాలి. ప్రజలు కూడా రెండు పార్టీలను ఆదరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



