| << Newer | Older >> |
on 2008/6/22 5:36:58
పార్టీ అజెండా రూపకల్పన తో పాటు రాజకీయ అంశాలు, సామాజిక సమస్యల పై చక్కటి అవగాహన ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్న చిరు నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, బి, సి, నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీలో చంద్రబాబు తరువాత స్థానం లో ఉన్న దేవేందర్ గౌడ్ కు ఆహ్వానం అందినట్లు వినికిడి. దేవేందర్ గౌడ్ తమ పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని చిరు స్వయంగా చెప్పినట్లు వినిపిస్తోంది.. త్వరలో ప్రారంబించనున్న తమ పార్టీలో దేవేందర్ గౌడ్ కు పెద్ద పీట వేస్తామని కూడా చిరంజీవి హామీ ఇచ్చారని సమాచారం. తెలంగాణా విషయం లో తాడో, పేడో తేల్చుకోవాలని పార్టీ నేత వద్ద తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న దేవేందర్ గౌడ్ విషయం పై మొదటి నుంచి అపనమ్మకం తో ఉన్న చంద్రబాబు ఆయన కదలికల పై నిఘా ఉంచారని తెలిసింది. టి. డి. పి. నుంచి దేవేందర్ బైటకు వెళ్ళడం ఖాయం అని నిర్ధారణకు వచ్చిన బాబు పైకి దేవేందర్‌తో సఖ్యతను ప్రదర్శిస్తున్న లోపల గౌడ్ ను సాగ నంప డానికి పొగ పెట్టారని తెలిసింది. దేవేందర్ గౌడ్ పై తలసాని ద్వజం ఎత్తడం వెనుక కారణం ఇదేనని అనుమానించిన గౌడ్ అదే విషయాన్ని చంద్ర బాబు మొహం మీదనే అనెసరికి బాబు కూడా ఖంగు తిన్నారు. సున్నితమైన తెలంగాణా అంశం ఒక్క సమావేశం తో తేలదని, తెలంగాణా విషయం లో తొందర పాటు తగదని బాబు తెలంగాణా సీనియర్ నేత డౌడ్ కు చెప్పారు. గౌడ్ కూడా ప్రస్తుతానికి బాబు మాట వింటున్నట్లు నటిస్తున్నా మరోపక్క తన దారి తాను చూకోడానికి సిద్దం అవుతున్నారు. పైకి మాత్రం వీరిద్దరూ మాట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



