| << Newer | Older >> |
on 2008/5/9 5:54:17
ద్రవ్యోల్భనాన్ని అదుపు చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెలలో చివరివారం ముగిసే నాటికీ ద్రవ్యోల్భణం మరింత పెరిగి 7. 61 శాతానికి చేరుకొంది. అంతకు మునుపు వారం ద్రవ్యోల్భణం 7. 57 శాతం గా ఉండేది. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా త్వరలోనే ధరలు అదుపు లోనికి వస్తాయని కేంద్ర మంత్రి చిదంబరం ఇటీవల వెల్లడించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా ధరలు తగ్గినట్లు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య కూడా ప్రకటించారు. అయితే ధరలు ఏ మాత్రం అదుపులోకి రాకపోగా ప్రభుత్వ చర్యలు ద్రవ్యోల్భణం పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేక పోయాయి. పెరిగిన ద్రవ్యోల్భణం టోకు ధరల సూ చీ లో 0. 1 శాతంగా నమోదయింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



