| << Newer | Older >> |
on 2008/10/8 10:56:23
రాష్ట్రం లో రాజకీయాలు చాలా గమ్మత్తుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఈ ది విపక్షల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం తెలంగాణా చుట్టూ తిరుగుతుంటే తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత మాత్రం అధికారం కోసం వివిద రాజకీయ పార్టీల నేతల చుట్టూ తిరుగు తున్నారు. తెలంగాణకు జై అని అనే ఏ పార్టీతో నైనా అంత కగడానికి సిద్దం అయిపోతున్నారు. పైకి ఎన్ని చెప్పిన లోలోపల ఆయనకు కూడా పార్టీల వైఖరులపై పూర్తి నమ్మకం కలగడం లేదు. దానికే అటు వామపక్ష పార్టీలతో చర్చలు జరుపుతూ ఇటు తెలుగుదేశం పార్టీ జారిపోకుండా చూసుకొంటూ వస్తున్నారు. వామపక్ష పార్టీల జాతీయ నేతలను డిల్లీ లో కలిసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అటు కేంద్రం లో, ఇటు రాష్ట్రం లో కలిసి పనిచేయడానికి తాను సిద్దం అని చెప్పి తెలంగాణా కు సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. తమది సమైక్య వాదమైనా, తెలంగాణకు తాము అడ్దంకి కాబోమని సి. పి. ఎం చెప్పిన మాట కె. సి. ఆర్. చెవికి కమ్మని సంగీతాన్ని అందించినట్లు అయింది. మొదటి నుంచి సి. పి. ఐ. తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగుదేశం విషయంలో టి. ఆర్. ఎస్. కొంచెం అనుమానం ఉండేది. అలాగే టి. డి. పి. కి కూడా టి. ఆర్. ఎస్. విషయంలో అపనమ్మకం ఉండేది. తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత టి. ఆర్. ఎస్. ప్రజారాజ్యం పార్టీ వైపు మొగ్గు చూపితే ఎలా అన్న సందిగ్దాత చంద్రబాబు కు ఉంది. తెలుగుదేశం నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉంటే ప్రజారాజ్యం పార్టీని కలుపుకుంటామని సంకేతం ఇచ్చి తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టడానికే కె. సి. ఆర్. తన రాజకీయ ఎత్తుగడ ను వేశారు. ఇద్దరికి ఎకరిపై మరొకరికి నమ్మకం లేదు. గత రెండు రోజులుగా టి. డి. పి. ఒక పక్క కోర్ కమిటీ సమావేశం , రెండు రోజులు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాల్లో తెలంగాణాపై చాలా లోతుగా చర్చించింది. సున్నితమైన తెలంగాణా అంశం పై వెంటనే నిర్ణయం తీసుకోవడం సాద్యం కాదని పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రం నాయుడు చెప్పారు. అయితే తెలంగాణా పై టి. డి. పి. సానుకూల నిర్ణయం తీసుకోవడం ఎప్పుడో జరిగి పోయింది. కాకపోతే డానికి ప్రజాస్వామ్య విధానం , ప్రజాభిప్రాయ సేకరణ, మూడు ప్రాంతాల పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకోవడం అంటూ ఇంతకాలం బండిని లాగించింది. ప్రణబ్ కమిటీలగా తెలంగాణా పై సాచివేత ధోరణి అవలభించడం కుదరదని గ్రహించిన టి. డి. పి. చివరికి అన్ని పూర్తి చేసి రేపు తెలంగాణాపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనున్నట్లు చంద్రబాబు నాయుడు బుదవారం డిల్లీలో ఉన్న తనకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందని కె. సి. ఆర్. మీడియాకు వెల్లడించడం తో టి. డి. పి. లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తమ అధినేత తొందర పడి కె. సి. ఆర్. కు చెప్పడం ఎందుకన్నా ప్రశ్న వారిలో ఉదయించింది. ఆది పక్కన పెడితే ఇక్కడ చంద్రబాబు, కె. సి. ఆర్. ల విషయానికే వస్తే వారిలో ఒకరిపై ఒకరికి ఎంత విశ్వాసం, నమ్మకం ఉందో పై అంశం ఒక చక్కటి ఉదాహరణ గా చెప్పవచ్చు. తమ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు బాబు కె. సి. ఆర్. కు చెప్పిన విషయాన్ని కె. సి. ఆర్. మీడియాతో చెప్పడం తొందరపాటు అనే అనుకోవాలి. రేపటిదాకా ఆగకుండా కడుపు ఉబ్బారాన్ని తట్టుకోలేక బైట పెట్టడం విశేషం. రేపటిలోగా టి. డి. పి. నిర్ణయం మారిపోతుందేమో నని కె. సి. ఆర్. అనుమానం. అందుకే టి. డి. పి. ముందరి కాళ్ళకు బందం వేసే ఉద్దేశం తోనే టి. డి. పి. నిర్ణయాన్ని ముందే బైట పెట్టారని అనిపిస్తోంది. కె. సి. ఆర్. ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళకుండా చూడటానికి తన పార్టీ నిర్ణయాన్ని బాబు ముందుగానే కె. సి. ఆర్. కు చెప్పారని అని పిస్తోంది. పైగా దేవేందర్ గౌడ్ పార్టీ టి. ఆర్. ఎస్. తో కలవడానికి అవకాశం ఇవ్వకూదనకూడా బాబు ఆలోచించినట్లు ఉంది. ఆది అమైన ఇద్దరు నేతలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేదన్నది దితో స్పష్టమైంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



