| << Newer | Older >> |
on 2008/10/9 10:39:30
ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దల్ల మారిపోతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శల వర్షం కురిపించారు. విజయదశమి రోజున అరసవిల్లి లో సూర్యనారాయణ స్వామికి పూజాధికాలు నిర్వహించిన చిరంజీవి అనంతరం అక్కడ రోడ్ షో లో పాల్గొన్నారు. ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకొని పడ్డారు. అధికారం లో ఉన్న వారు సామాన్య ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఎంతసేపు తమ ఏదుగుదలనే చూసుకుంటున్నారని నిప్పులు కక్కారు. వందలాది ఎకరాల భూములు నేతలకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వాల్లో ప్రజా ప్రతినిదుల్లొ జవాబుదారీ తనం కొరవడిందని ఆరోపించారు. ప్రజల అవసరాలు తీర్చాలన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని వాపోయారు.
చిరంజీవి ప్రసంగం సాంతం ఆలకిస్తే గతం లో అధికారం లో ఉన్న అన్ని ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. ఆ పార్టీ ఇ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలను టార్గెట్ చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీని నేరుగా విమర్శించలేదు. ఆయన ఆరోపణలు విమర్శ లన్ని పరోక్షంగానే సాగాయి. డైలాగులు బాగానే ఉన్న ఆది ప్రజలను ఆకర్షించలేక పోయింది. నాలుగేళ్ళ క్రితం నాలుగు ఎకరాలు కూడా లేని నాయకులు ఇప్పుడు వందలాది ఎకరాలను ఎలా సంపాదించారో నిలదిద్దాం రమ్మని ప్రజలను పిలవడం గమనార్హం. ఎక్కడ కూడా చిరంజీవి నేరుగా ఎవరి పై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదు. తన రథం నుంచి అభివాదం చేస్తూ ప్రసంగించారు. ప్రజల ఆస్తులకు కాపలా ఉండాల్సిన నాయకులే భూములను కైవసం చేసుకుంటున్నారని అలాంటి వారిని నిలదిద్దాం రండి అని పిలుపు ఇచ్చారు. ఒక్క విషయం చిరంజీవి మార్చిపోయారు. నిల దియండి అని అని అనడం వేరు రండి నిలదిద్దాం అని అనడం వేరు. చిరంజీవి ప్రసంగం లో ఎక్కడ అలాంటి మాటలు కనిపించలేదు. యువతను టార్గెట్ చేసుకున్న తీరు కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. చిరంజీవి విసిరిన డైలగ్‌లు వింటుంటే కాస్త అలనాటి ఎన్. టి. ఆర్. ను అనుకరించడానికి ప్రయత్నించారని అనిపించింది. 1982 లో ఎం. టి. ఆర్. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను 'కుక్క మూతి పిందెలని' నేరుగానే విమర్శించారు. ఇపుడు చిరంజీవి అలాంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ప్రజల సహకారం తో గద్దె నెక్కిన పెద్దలు గద్దలుగ మారిపోతున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



