| << Newer | Older >> |
on 2008/9/13 8:05:52
కోటా వ్యవస్థకు స్వస్తి పలికి, ప్రతిభ తో పాటు గెలిచే వారికే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని డిల్లీ లో శనివారం జరిగిన సి. డబ్ల్యూ. సి. సమావేశం లో నిర్ణయించారు. సోనియా అద్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఇటీవల కాలం జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘొరపరాజయానికి కారణలపై సుడిర్గంగా చర్చించారు. అంతర్గత కుమ్ము లాటల వల్లే పార్టీ పరాజయం అయిందని సోనియా గాంధీ నిర్ణయానికి వచ్చారు. అంతర్గత కుమ్ము లాటలకు ఇక నైనా స్వస్తి పలికి కలిసి కట్టుగా పనిచేసి పార్టీని విజయపథం వైపు నడిపించాలని ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిభకు పట్టం కట్టాలని నిర్ణయించారు. పాత పడిన కోటా వ్యవస్థకు మంగళం పాడక పోతే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోలేమని కమిటీ అభిప్రాయపడింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



