| << Newer | Older >> |
on 2008/10/7 8:42:14
తెలంగాణ విషయం లో తెలుగుదేశం పార్టీ ఎటు తేల్చుకోలేక పోతోంది. సోమవారం కోర్ కమిటీ సమావేశం, మంగళవారం పొలిట్ బ్యూరో సమావేశం ముగూసియాన్ తరువాత కూడా తెలంగాణాపై పార్టీ ఒక నిర్ణయానికి రాలేక పోతోంది. పోతులా విషయం లో సి. పి. ఎం. ఈ నెల 12 వ తేదీ నుంచి కోల్ కత్త లో జరగనున్న సి. పి. ఎం పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు హైదరాబాద్ లో మంగళవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం లో పాల్గొన్న ప్రకాష్ కారత్ చెప్పారు. సి. పి. ఎం. పార్టీ పొత్తుల విషయం లో తుది నిర్ణయం తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణాపై ఒక నిర్ణయానికి రాక పోవచ్చు. సి. పి. ఐ. ఇప్పటికే తెలంగాణ విషయం లో తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బి. జె. పి. తెలుగుదేశం పార్టీలు మినహా మిగిలిన పార్టీలతో పొత్తులకు వ్యూహం రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో తమ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని సి. పి. ఎం చెబుతున్నా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల విషయం లో సి. పి. ఎం కూడా ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించడం లేదు. ప్రజారాజ్యం విషయం గురించి కూడా సి. పి. ఎం పరిశీలిస్తోంది. చిరంజీవి ప్రజల మద్యలోకి వెళ్ళిన తరువాతే ఆయన పర్యటనపై ప్రజా స్పందన , న్యూక్లియర్ డిల్, ఇతర విషయాల పై ప్రజారాజ్యం పార్టీ అనుసరించే విధానాలు, ఆ పార్టీ విధాన నిర్ణయాలు గమనించిన తరువాతే ప్రజారాజ్యం పార్టీ గురించి ఒక అభిప్రాయానికి రావాలని బావిస్తోంది. ఒకవేళ వామపక్ష పార్టీలు రాష్ట్రం లో తమను కాదని ప్రజారాజ్యం పార్టీ తో కలిసి పనిచేయాలనుకుంటే తమ పరిస్థితి ఏమిటని టి. డి. పి. కూడా ఆలోచిస్తోంది. తెలంగాణ విషయం లో టి. ఆర్. ఎస్. తో పొత్తు విషయం లో కూడా పార్టీలో భిన్న అభిప్రాయాలు వెల్లడి కావడం కూడా పార్టీని ఆలోచనలో పడేసింది బహుశా ఈ నెల 12 వ తేదీ దాకా తెలంగాణ పై టి. డి. పి. ఎలాంటి నిర్ణయం తీసుకునే సూచనలు కనిపించడం లేదు. బుధవారం కూడా టి. డి. పి. పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. తెలంగాణ తో పాటు పలు అంశాలను కూడా పొలిట్ బ్యూరో చర్చించనుంది. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తరువాతనే పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



