| << Newer | Older >> |
on 2008/7/8 4:33:59
కేంద్రమంత్రి శరద్‌పవార్ తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేశారు.
కేంద్రంలోని యు. పి. ఏ. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పవార్ ఆయన ను కోరారు. తెలంగాణా విషయం లో తేల్చి చెబితే అప్పుడు ఆలోచిస్తామని కె. సి. ఆర్. పవార్ కు సమాధానం ఇచ్చారు. కేంద్రం లోని యు.పి. ఏ. ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉప సంహరించిన నేపథ్యం లో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన మద్దతును కూడా గట్టా డానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రంగంలోకి దిగారు. ఆయన తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ కు ఫోన్ చేశారు. యు. పి. ఏ. కు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణా రాష్ట్ర సమితి తరుపున ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారి మద్దతు కోసం శరద్ పవార్ కె. సి. ఆర్. కు ఫోన్ చేయడం విశేషం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



