| << Newer | Older >> |
on 2008/10/10 9:33:24
తెలంగాణా అంశం పై కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తెలంగాణా అంశం పై పార్టీ ఏదో ఒక వైఖరిని వెల్లడించని పక్షం లో రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని ఆ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటున్నారు. తెలంగాణా కోసం నానా హడావుడి చేసిన తెలంగాణా కాంగ్రెస్ వాదులు గత కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. తెలంగాణాకోసం ప్రత్యేకంగా ఏర్పటైన టి. ఆర్. సి. సి. కూడా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. మొదట్లో మధు యాష్కీ తెలంగాణాను సమర్ధించారు. ఇపుడు ఆయనకూడా పెద్దగా మాట్లాడలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా వాదుల్లో ఇపుడు ఆందోళన మొదలైంది. సి. పి. ఐ. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోవడం, టి. డి. పి. అదే బాటలో పయనించడం జరిగింది. ఇక ప్రజారాజ్యం పార్టీకూడా తెలంగాణాపై సానుకూలంగా స్పందిస్తే రానున్న ఎన్నికల్లో తమకు గడ్డు పరిస్థితి తప్పదని తెలంగాణా కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో చేర్చనునట్లు మంత్రి జీవన్ రెడ్డి మొన్న అన్నారు. ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగిన తరువాత తెలంగాణా అంశం అధిష్టానం వద్ద ప్రస్తావించి సాదిస్థామని కాంగ్రెస్ ఎం. పి. , సీనియర్ నేత జి. వెంకట స్వామి అన్నారు. తెలంగాణా కోసం నానా హడావుడి చేసిన తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలంత నిన్నటిదాకా మౌునాన్ని పాటించడం వెనుక ఎం జరిగింది. ఆ నేతలపై వత్తిడి వచ్చిందా? అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందాయో తెలియదు కాని ఒక్క సరిగా ఎం. ఎస్. ఆర్., ఉప్పునూతల, చిన్నారెడ్డి, తదితరులంతా నోరు విప్పకుండా మిన్న కుండి పోయారు. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న చివరికి తెలంగాణా ఇవ్వగలిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని అంటున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణా ఇచ్చి ప్రజల్లో తమ పార్టీ ప్రతిష్టను పెంచడానికి ఎందుకు ప్రయత్నించడం లేదో అర్థం కావడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కన్నా వెనుక బడిన తెలంగాణాను అభివృద్ది దిశగా నడిపించి సమైక్య గా ఉంచాలని రాష్ట్రాధీనేత అభిమతంగా ఉంది దానికి అధిష్టానం కూడా సమ్మతించినట్లు ఉంది. అందుకే తెలంగాణాపై ఎవరు ఏమీ మాట్లాడిన , ఎంత గొంతు చించుకున్న ఏమీ తేలడం లేదు. పైగా తెలంగాణా వాదన వినిపించకుండా తెలంగాణా కాంగ్రెస్ నేతలను ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కి నట్లు అర్థం అవుతోంది. తెలంగాణా విషయం లో కాంగ్రెస్ వాదుల్లో అలజడి ఉన్న ఎమిచేయలేని నిస్సహయ స్థితి లో ఉండి పోతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



