| << Newer | Older >> |
on 2008/7/17 4:41:09
రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని ఒక సర్వే లో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర రాజధానిలోని జంట నగరాల్లో ఎన్నికలు జరిగేతే ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారన్న దానిపై జరిగిన సర్వే లో కాంగ్రెస్ పార్టీ అగ్ర స్థానంలో ఉంది. మజ్లిస్ పార్టీ ద్వితీయ స్థానం లో ఉండగా, తెలుగుదేశం పార్టీ తృతీయ స్థానానికి పరిమిత మైంది. ఎన్. టి. వి. ఛానెల్ కోసం నెలిసన్, ఓ. ఆర్. జి. మార్గ్ సంస్థ నిర్వహించిన సర్వే లో పై విషయాలు వెల్లడయింది. ఈ సర్వే లో మరో ఆసక్తి కరమైన విషయం వెల్లడి అయింది. ప్రజల్లో విపరీత ఆదరణ ఉన్న, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి స్థానం దక్కక పోవడం సర్వే నిర్వాహకులను కూడా నివ్వెరపరిచింది. ఇది చిరు అభిమానులకు నిరాశ కలిగించే వార్త. జంట నగరాల్లో చిరు పార్టీ కి గాని చిరు కు గాని ఎలాంటి స్థానం రాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రత్యేక తెలంగాణా కోసం గత ఏడేళ్లుగా పోరాడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి కీకూడా ఈ సర్వే ఫలితం నిరాశనే మిగిల్చింది. టి. ఆర్. ఎస్. కు కూడా ఆదరణ తగ్గినట్లు సర్వే ద్వారా వెల్లడైంది
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



