| << Newer | Older >> |
on 2008/6/27 22:54:15
తెలంగాణా ప్రాంతంలోని కరీం నగర్‌లో రెండు రోజులపాటు భారతీయ జనతా పార్టి రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశంలో 2009 ఎన్నికల్లో పార్టి అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది. ముందస్తు ఎన్నికలు రావచ్చునన్న సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాదన తో పాటు రానున్న ఎన్నికల్లో పార్టి తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను రూపొందించే విషయాన్ని కూడా పార్టి రాష్ట్ర కార్యవర్గం చర్చించనుంది. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రానున్న ఎన్నికల్లో పార్టి ని సమాయత్తం చేయడం పై చర్చ జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచడానికి తీసుకోవాల్సిన చర్యల పై కూడా చర్చ జరగనుంది. తెలంగాణా విషయం లో టి. ఆర్. ఎస్., దేవేందర్ ల మధ్య ఎలాంటి సఖ్యాత కుదురుతుంది అన్నది పార్టి అధ్యయనం చేయనుంది. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎలక్షన్ కమిటీని నియమించే విషయం కూడా సమావేశం చర్చించనుంది.
కమిటీ ఏర్పాటు పూర్తి చేసిన తరువాత అభ్యర్థుల ఎంపిక ప్రకియ చేపట్టనుంది. రెండు రోజుల సమావేశం లో ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి ఈ సమావేశం లోతుగా చర్చించనుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



