| << Newer | Older >> |
on 2008/5/8 6:04:07
డబ్బు ఎవరికి చేదు . హోదా కన్నా డబ్బే ముఖ్యమని ఎవరైన చెబుతారు. ఒకప్పటి ప్రముఖ క్రికెటర్ గవాస్కర్ కూడా అటు వైపే మొగ్గు చూపడం లో అతిశయోక్తి లేదు. గత ఎనిమిదేళ్లుగా ఐ. సి. సి క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తూ వచ్చిన భారతే క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఐ. సి. సి క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిని వదులుకున్నారు.. కాల మిస్ట్ , కామెంటేటర్ గా కొనసాగాలని నిర్ణయించుకున్న గవాస్కర్ ఐ. సి. సి ఛైర్మన్ పదవి ని త్యజించారు. ఐ. సి. సి క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవినైనా, కామెంటార్- కాల మిస్ట్ పదవుల్లో ఏదో ఒక్కటే కొనసాగించాలని ఐ. సి. సి గవాస్కర్ కు సూచించింది. జోడు పదవుల్లో కొనసాగడం కుదరదని స్పష్టం చేసింది. కాలమిస్ట్ కామెంటేటర్ గా చాలా బూసైగ ఉన్న గవాస్కర్ నిజానికి ఐ. సి. సి కమిటీ ఛైర్మన్ గా ఆ పదవిని న్యాయం చేయలేక పోతున్నారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. రెండింటిలో ఏదో ఒక పదవిని ఎంపిక చేసుకోవాలని ఐ. సి. సి సూచించడం తో గవాస్కర్ రెండో దానికే ప్రాదాన్యతను ఇచ్చారు. కామెంటేటర్ గా, కాలమిస్ట్ గా ఇప్పటికే గవాస్కర్ కు మంచి పీరు ఉంది. పైగా కాలమిస్ట్ గా వ్యవహరించడానికి ఇప్పిటికే పలు మీడియా సంస్థలతో కోట్లాది రూపాయలకు కాంట్రాక్ట్‌లు కుదుర్చుకున్న గవాస్కర్ వాటిని వదులుకోవడం వల్ల డబ్బు పోవడమే కాకుండా న్యాయ పరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దాంతో గవాస్కర్ ఐ. సి. సి పదవిని వదులుకున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



