| << Newer | Older >> |
on 2008/6/18 8:42:39
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు, దివంగత ముఖ్య మంత్రి ఎన్. టి. రామారావు పేరిట ఒక అంతర్జాతీయ వైమానిక విశ్వ విద్యాలయాన్ని బేగం పేట లోని పాత ఎయిర్ పోర్ట్ భవనం లో ఏర్పాటు చేయడానికి అనుమంతించాలని ముఖ్య మంత్రి వై. ఎస్. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. తన రెండు రోజుల డిల్లీ పర్యటనలో నగంగా బుదవారం డిల్లీ చేరుకున్న ముఖ్య మంత్రి పలువురు కెన్‌ఫ్రా మంత్రులను కలుసుకున్నారు. బేగంపేట లో ఎన్. టి. ఆర్ పేరిట ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్. టి. ఆర్. పేరు చిరస్థయగ నిలిచిపోవాలని ముఖ్య మంత్రి ఆశిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్. టి. ఆర్. పేరిట ఒక వైమానిక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వై. ఎస్. నిర్ణయించడం అభినందనీయం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



