| << Newer | Older >> |
on 2008/10/7 11:29:31
అన్ని రంగాల్లో లాగానే రాజకీయరంగం లోను వారసత్వాలు ఉంటాయి. ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి తనకుమారుడు జగన్ ను రానున్న ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానానికి పోటీచేయించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న జగన్ ఇపుడు సాక్షి దిన పత్రిక యజమాని కూడా. జగన్ ను రాజకీయాల్లోకి దింపాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయ ఆర్గ్రేటం కోసం వై. ఎస్. సోదరుడు వివేక నంద రెడ్డి తన ఎం. పి. పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దం అయ్యారు. సోనియాగాంధీ జోక్యం తో వివేకానంద రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రానున్న ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి జగన్ పోటీ చేయడానికి వీలుగా వివేకానంద రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరదన్న నిర్ణయానికి వచ్చారు. అబ్బాయి రాజకీయ రంగ ప్రవేశం కోసం బాబాయి తన రాజకీయ జీవితనానికి పులి స్టాప్ పెడుతున్నారన్న మాట.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



