| << Newer | Older >> |
on 2008/7/27 6:12:26
రానున్న ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్దం కావాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత , పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దైడరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆదివారం అరిగిన పి. సి. సి. కార్యవర్గ కమిటీ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోను, రాష్ట్రం లోను చేపట్టిన అభివృద్ది పథకాలు, సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో వై. ఎస్. పాలనను ఆయన ప్రశంసించారు. రాష్ట్రం లో ముఖ్య మంత్రి చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గురించి తాను తెలుసుకొన్నానని చెప్పారు. పేదలు, బలహీన వర్గలాభ్యున్నతికి వై. ఎస్. ప్రభుత్వం పాటు పడుతున్న తిరు హర్షదాయకమని తెలిపారు. రాష్ట్రం లో రానున్న కొత్త పార్టీలు, కొత్త కూటముల కదలికలను గమనించాలని సుచిన్చరు.ఇ వాటి వల్ల కాంగ్రెస్ పార్టీ కి నష్టం వాటిల్లే అవకాశం లేదని అన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తధ్యం అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ వెన్న ముకగా నిలిచిందని అభివర్ణించారు. గాంధీ కుటుంబానికి రాష్ట్రం చాలా సన్నిహితమైందని ఈ బందం పదికాలల పాటు కొనసాగాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఏ. ఐ. సి. సి. ప్రధాన కార్యదర్శి అయిన రాహుల్ కోరారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



