| << Newer | Older >> |
on 2008/7/4 20:34:06
రాష్ట్రం లో తమ ప్రభుత్వ పాలన బెష్ గా ఉందని, ప్రభుత్వం పై వ్యతిరేకత పెద్దగా లేదని ముఖ్య మంత్రి రెండు రోజుల కలెక్టర్లు, ఎస్. పి. ల సమావేశం లో చాలా గొప్ప గా చెప్పారు. ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించడం లేదని చెబుతున్న సి. ఎం. మాటలను కాసేపు నిజం అని అనుకుందాం. నాలుగేళ్ళ కాలంలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భారీగా చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసిన 230 అసెంబ్లీ, 36 పార్లమెంట్ సీట్లు తమావే నని ఢంకా బజాయించి చెబుతున్న ముఖ్య మంత్రికి మిగిలిన కొద్ది నెలల్లో మరింత బాగా పని చేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచామని చెప్పడంలో తప్పు లేదు. అయితే అదే విషయాన్ని పదే పదే చెప్పడం కార్యనిర్వాహక వర్గాన్ని ప్రదేయ పడటం ఎందుకు? ఆయనకు ఎందుకంత కలవరం? తాను ఎన్ని పథకాలు చేపట్టిన , మరెన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్న ప్రభుత్వ పాలన పై ఆయనకు నమ్మకం సడలిందా? లేదా తన పై తనకు నమ్మకం లేదా? రాష్ట్రం లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ముఖ్య మంత్రి చెబుతున్నారు. అదే నిజమైతే కార్యనిర్వాహక వర్గాన్ని ప్రాదెయ పడటం ఎందుకు. ఇందిరమ్మ గృహ నిర్మాణం నత్త నడకన సాగుతోందా, జలయజ్ఞం ద్వారా ఈ నాలుగేళ్లలో ఎన్ని ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి సాగు నీరు అందించారు అన్నది కలెక్టర్ల సమావేశం లో చోటు చేసుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వై. ఎస్. ప్రభుత్వం ఇచ్చిన 2797 హామీలాలో 2052 హామీలు అమలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. నిజంగా ప్రభుత్వ హమిలన్ని అమలు పరచడం లో అధికారులు పూర్తి గా నిమగ్నమై ఉంటే వారిని సమీక్ష పేరుతో పిలిచి రెండు రోజులు సమావేశం జరపడం ఎందుకో? మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటం అధికార పార్టీకి అండగా నిలవాలని పరోక్షంగా చెప్పడమే ఈ సమీక్ష సమావేశం ఉదేశమని చెప్పవచ్చు. ప్రతి ఏటా జరగాల్సిన కలెక్టర్లు, ఎస్. పి. ల సమీక్ష సమావేశం కారణాంతరాల వల్ల కొన్ని సార్లు నిర్వహించలేక పోవచ్చు. ఎందువల్ల నిర్వహించలేక పోయారో సమీక్ష కు ముందు ముఖ్య మంత్రి వివరించి ఉంటే ఇలాంటి అనుమానాలకు తావుండేది కాదు. పాలన యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే పద్దతికి స్వస్తి పలకాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




