| << Newer | Older >> |
on 2008/10/11 10:01:16
తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాల విధ్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. తన ప్రజా అంకిత యాత్రలో బాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లాలోని పలుప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షో ల్లో ప్రసంగించారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారి కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ ని రూపొందిస్తామని అన్నారు. కొబ్బరి రైతులను అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టి ఎం చేస్తానని ప్రశిస్తున్న వారికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ది చేసి చూపి మాటల్లో కాక చేతల్లో బదులు చెబుతానని చిరంజీవి చెప్పారు. చిరు యాత్ర సందర్భంగా శనివారం సోంపేట వద్ద ఒక ఇంటి పిట్ట గోడ పై ఎక్కిన వారు ఆ గోడ కూలడం తో దాదాపు 8 మంది గాయపడ్డారు. అలాగే గురువారం అరసవిల్లిలో చిరు సభ సందర్బంగా జరిగియం తొక్కిసలాటలో ఒక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు అయ్యాడు. అతను శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసి చిరంజీవి చలించిపోయారు. ఆ కుటుంబానికి లక్ష రూపాయల సహాయాన్ని ప్రకటించారు. స్థానిక నేతలు కూడా ఆర్థిక సాయం అందించడానికి ముందుకువచ్చారు.
జిల్లాల్లో సభ్యత్వ నమోదు13 నుంచి
జిల్లా స్థాయిల్లో ప్రజారాజ్యం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 13 వ తేదీ నుంచి చేపట్టనుంది. సభ్యత్వ నమోదు, పార్టీ పని తిరు పర్యవేక్షణకు జిల్లాల వారీగా ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రజాసేవ కూడా చేయాలన్న ఆశయం తోనే మొక్కలను నాటే కార్యక్రమానికి పి. ఆర్. పి. శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ అధికార ప్రతినిది ప్రభాకర్ చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



