| << Newer | Older >> |
on 2008/9/24 6:35:23
రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి తమ పార్టీ వెనుకాడదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తమ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పనిచేయవచ్చునని చెప్పారు. తమ విధానాలు నచ్చి తమ తో కలిసి పనిచేయడానికి సిద్దం అయిన పార్టీతో చర్చలు జరపడానికి, పొత్తులు పెట్టుకోడానికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. సి. పి. ఐ. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తనను కలిసి చర్చించారని ఆ చర్చల్లో పొత్తుల విషయం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. మరోసారి సమావేశమైనపుడు పొత్తుల విషయం చర్చించుకోవచ్చునని తాను ఆయనకు సూచించానని అన్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి తో పొత్తు గురించి తమ వైఖరిని ఇప్పుడే చెప్పలేమని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుకు సంబందించి ఆ పార్టీ నుంచి తమకు ఎలాంటి సంకేతాలు అందలేదని కూడా పేర్కొన్నారు. పార్టీ కోర్ కమిటీలో అణు ఒప్పందం పై సమగ్రంగా చర్చించినా తరువాతనే తమ విధానాన్ని వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిశకరాలకోసం రెండు కమిటీలను నియమించనున్నామని తెలిపారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



