| << Newer | Older >> |
on 2008/10/10 11:46:24
రాజకీయ పార్టీల నేతలు తమ పర్యటనల్లో వాగ్దానాలు చేయడం, హామీలు గుప్పించడం సర్వ సాదారణం. యాత్రల్లో రాజకీయ పార్టీల నేతలు ఆవేశ పూరిత, ఉద్వేగ భరిత ప్రసంగాలు చేస్తూ తమను తాము మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు ఎడా పేడ హామీలు ఇచేస్తున్నారు. వరాలను ప్రకటిస్తున్నారు. తాము చేస్తున్న హామీలు, వాగ్దానాలు ఆచరణ సాద్యమా కదా అన్నది ఆలోచించరు. ప్రజలను ఆకర్షించడమే వారి కర్తవ్యం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి, ప్రధాన ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం లో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. మద్యన్ని నిషేదిస్తామని ఆది కూడా ప్రజలు కోరుకుంటే ఆనే ఒక చ్చిన ష రత్తు పెడుతూ టి. డి. పి. నేత వాగ్దానం చేస్తున్నారు. కరెను విషయం లోను ఇష్టనుసారం నోటికి ఎం వస్తే ఆది చెబుతున్నారు. బెల్ట్ షాపు లపై టి. డి. పి. పోరాటం చేస్తూ తాము అధికారం లోకి రాగానే బెల్ట్ షాపులను తొలగిస్తామని చెబితే, అధికారం లో ఉన్న ప్రభుత్వం వేటనే బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లు ప్రకటించి కళ్ళు గీత కార్మికులు సొసైటీల నుంచి తీసుకున్న 8. 50 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక వై. ఎస్. ఎక్కడికి వెళితే అక్కడ ఎవరు ఎం అడిగితే ఆది, ఒక్కోసారి అడగక పోయిన ఉదారంగా వాగ్దానాలు చేసేస్తున్నారు. ఈ పోటీ నేతలు పోటీ పడి చేస్తున్న వాగ్దానాలు ఇప్పటికే కొండవీటి చేంతాడు ను మరిపిస్తోంది. ఎన్నికల తరువాత ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన ఇవన్ని అమలు చేయడం ఏ మాత్రం సాద్యం కాదు. ఇద్దరు నేతలు ప్రజలకు ఇస్తున్న వరాలను వేస్తే వేస్తే రాష్ట్ర బడ్జెట్ మాత్రమే కాదు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోడేమో నని అనిపిస్తోంది. వారిద్దరూ ఇలా తమ చేతికి ఎముక లేనట్లుగా వరాలను ఇస్తుంటే నేను మాత్రం తక్కువ తిన్ననా అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా వారితో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు విద్యుత్ పై గతం లో చేసిన వాగ్దానం గుర్తుం డే ఉంటుంది. రైతులకు 9 గంటలపాటు నిరాటాంకంగా విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పి ఆది చేయలేక పోయారు. తాను అధికారం లోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని వై. ఎస్. హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీని నిలుపుకోడానికి వై. ఎస్. ఎన్ని తంటాలూ పడుతున్నారో అందరు గమనిస్తున్నారు. వాన కాలం లో కూడా కోత తప్పడం లేదు. అనధికారిక కోత పెడుతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఉత్పత్తి, పంపిణీల మద్య వ్యత్యాసం చాలా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కి అవసరమైన థర్మాల్‌కేంద్రాలు తగినన్ని లేవు. హైడ్రో పై అధరపదదమన్తె సకాలం లో వర్షాలు కురవక ప్రాజెక్టు ల్లో తగినంత నీరు లేక అవస్థలు పడుతున్నాము. బయటి నుంచి కొనడానికి తగినంత విద్యుత్ లభ్యం కావడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మాత్రం ధారాళంగా ఒక వాగ్దానం చేసేసారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంటును అందిస్తామని ఎంతో ఉదారంగా ప్రకటించారు. వై. ఎస్. తొమ్మిది గంటలపాటు. చంద్రబాబు అన్నే గంటల పాటు కరెంటును సరఫరా చేయలేక చేతులెత్తెస్తుంటే చిరంజీవి 24 గంటలపాటు రైతులకు ఉచిత కరెంట్ ఎలా ఇస్తారో తగిన ఆధారాలతో చెబితే ప్రజలు నమ్మడానికి అవకాశముంది. ఆచరణ సాద్యం కాని వాగ్దానాలు చేసి ప్రజల్లో పలుచన కావడం తగదు! నిజమే నా చిరంజీవి గారు!!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



