| << Newer | Older >> |
on 2008/6/15 1:23:29
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రైలు ఆగస్ట్‌లో ప్లాట్‌ఫారం పైకి రానుంది. ఎప్పుడెప్పుడా అని చిరు అభిమానులు కొండత ఆశతో ఎదురు చూస్తున్న చిరు రాజకీయ రంగ ప్రవేశానికి అనుకూల మైన సంకేతాలు అందాయి. చిరు రాజకీయాల్లోకి ఆగస్ట్‌లో అడుగు పెట్టడం దాదాపు ఖరారు అయినట్లు మెగాస్టార్ సోదరుడు నాగేంద్రబాబు వెల్లడించారు. అభిమానుల ఆదరాభిమానాలే చిరంజీవికి కొండంత అండ అని అన్నారు. అణగారిన వర్గాల ను ఆదుకోవడమే చిరు పార్టీ లక్ష్యమని నాగబాబు చెబుతున్నారు. సమాజంలో చిన్న చూపుకు గురైన మహిళలకు చిరు పార్టీ పెద్ద పీట వేయనుంది. పురుషులతో సమానంగా హోదా కల్పించడమేకాదు, రాజకీయంగా కూడా మహిళలకు33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సిద్దం అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి లో మహిళా మహొధ్యమమ్ పేరిట జరిగిన సమావేశం లో ప్రముఖ మహిళా రచయిత్రి ఓల్గా పాల్గొని ప్రసంగించారు. మహిళల పట్ల చిరంజీవి కి ఉన్న గౌరవం ఆదరణ చాలా ఎక్కువ అని పలువురు వక్తలు అన్నారు. చిరంజీవి పార్టీ లో మహిళలకు మరింత ఆదరణ లబిస్తుందన్న ఆశాబావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



