| << Newer | Older >> |
on 2008/7/27 7:06:26
గుజరాత్ రాష్ట్రం లోని అహమ్మదాబాద్ లో శనివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 52కు పెరిగింది. అరాష్ట్రం లో తీవ్రవాదులు భారీ విద్వాంసానికి పూనుకున్నారని పోలీసులు గుర్తించారు. పేలని బాంబులను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి బాంబులను మూడింటిని పోలీసులు గుర్తించారు. ఇక బాంబుల తయారీకి వినియోగించనున్న పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పున గ్రామంలో పేలుడు పదార్థాలతో వెళుతున్న ఒక వాహనాన్ని అనుమానం తో ఆపి సొదలు చేశారు. వాటిలో నట్లు, బోల్తులు, రసాయన పదార్థాలను తరలిస్తున్న విషయాన్ని గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అహమ్మదాబాద్, సూరత్ ప్రాంతలాల్లో పేలని రెండు బాంబులను గుర్తించడమే తీవ్రవాదుల భారీ విద్వాంసానికి కుట్ర పన్నారని చెప్పడానికి నిదర్శనం అని చెప్పవచ్చు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



