| << Newer | Older >> |
on 2008/7/28 0:07:47
గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్ లో పర్యటించడానికి ప్రధాని మన్మోహన్, యు. పి. ఏ. ఛైర్‌పర్సన్ సోనియా, కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ సోమవారం వెళ్లనున్నారు. వారు సోమవారం వివిద ఆసుపత్రుల్లో కోలుకుంటున్న బాధితులను వారు పరామర్షిఒంచనున్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో వారు పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయి. శనివారం జరిగిన వరుస పేలుళ్ల తో దాదాపు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. శనివారం నుంచి అహమ్మదాబాద్ లో పేలనీబాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడానికి గుజరాత్ పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా తనికిలు చేస్తోంది. ఆదివారం ఒక పేలని బాంబు ను గుర్తించి నిర్వీర్యం చేశారు. కొన్ని పేలుడు పదార్థాలను స్వాదినం చేసుకున్నారు. సోమవారం కూడా అహమ్మదాబాద్ లో ఒక పేలని బాంబును పోలీసులు కనుగొని దానిని నిర్వీర్యం చేశారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



