| << Newer | Older >> |
on 2008/6/28 9:31:22
అనుకున్నదొక్కటి, ఐనది ఒక్కటి కావడంతో ఈ పరిణామాన్ని టి. ఆర్. ఎస్. అధినేత జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్న దేవేందర్‌గౌడ్ టి. డి. పి. ఎలాగూ తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోదని అర్థం చేసుకొని ఆ పార్టీ వదిలి బైటకు వచ్చారు. టి. డి. పి. తో తెగతెంపులు చేసుకున్న దేవేందర్ గౌడ్ ను తన పార్టీలోకి ఆహ్వానించాలని కె. సి. ఆర్. అనుకున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉన్న తాను గౌడ్ ను ఆహ్వానించడం ఏమిటని అనుకున్నారో లేదా అహం అడ్డువచ్చిందో తెలియదుకాని ఆపనిని టి. ఆర్. ఎస్. సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు అప్పగించారు. జయశంకర్ దేవేందర్‌గౌడ్ లు కలుసుకున్నారు. టి. ఆర్. ఎస్. తో కలిసి తెలంగాణాకోసం ఉద్యమించాలని ఆయన దేవేందర్‌గౌడ్ కు చెప్పారో, లేదో తెలియదు కానీ చివరకు దేవేందర్ గౌడ్ శనివారం నిర్వహించిన తెలంగాణా సాదన సదస్సుకు మాత్రం జయశంకర్ అధ్యక్షత వహించడం చూసి కె. సి. ఆర్. షాక్ కు గురయ్యారు. తన తరుపున దేవేందర్ గౌడ్ వద్ద జయశంకర్ రాయబారం నడుపుతారని కె. సి. ఆర్. ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆది కాస్త ఆడియాశ కావడం దేవేందర్ గౌడ్ సదస్సు సక్సస్ కావడం కె. సి. ఆర్. జీర్ణించుకోలేక పోతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



