| << Newer | Older >> |
on 2008/10/7 12:18:41
సి. పి. ఐ. రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రతిపాదించిన అధికార పంపిణీ సూత్రం ఏ మాత్రం పని చేయదని ఆ పార్టీకి చెందిన జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి తేల్చి చెప్పడం తో ఇక నారాయణ తన ప్రతిపాదన గురించి మరిచిపోవడం మంచిది. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా వామపక్ష పార్టీలు బావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ను రాష్ట్రం లోను కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాలని సి. పి. ఐ. , సి. పి. ఎం. పార్టీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే అంతకన్నా బలమైన శక్తి కలిగిన పార్టీ అవసరమని సి. పి. ఐ. అభిప్రాయపడుతోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ కాస్త బలహీన పడినా ఆ పార్టీకి క్యా డర్ ఉందని, తెలంగాణాలోనూ పార్టీకి అంతో ఇంతో బలముందని వామపక్ష పార్టీలు బావిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీకి క్యా డర్ లేదు. అభిమానుల అండ దండలు ఉన్నాయి. రాజకీయ పార్టీకి అదొక్కటే సరిపోదు. ప్రజారాజ్యం పార్టీ తన విధానాలను ప్రటించడం లేదు. తాము ఎవరి దెగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైన వారు తనవద్దకే రావాలన్నా బావనతో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. టి. డి. పి. , ప్రజారాజ్యం పార్టీల వైఖరుల కోసం వేచి చూస్తున్నామని సి. పి. ఐ. పార్టీ చెబుతోంది. సి. పి. ఐ. రాష్ట్ర శాఖ ఏమో టీడీపిని కూడా దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తోంది. ప్రజారాజ్యం పార్టీతో కలవడమే మంచిదని సి. పి. ఐ. రాష్ట్ర శాఖ అభిప్రాయం. కాంగ్రెస్ ను ఓడించడానికి తాము కలిసి పనిచేస్తామని వామపక్షాలు చెబుతున్న ఒక పార్టీ బలపరిచే పార్టీని మరో పార్టీ బలపరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. వామపక్ష పార్టీలు గనక కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కు చాలా కష్టం. ఆది తెలిసినా వామపక్ష పార్టీలు మాత్రం కొన్ని విషయాల్లో సర్దుకోలేక పోతున్నాయి. రాష్ట్రం లో రాజకీయ పరిస్థితులు అస్పష్టంగా ఉన్న విషయం వాస్తవమే,కనీసం వామపక్ష పార్టీలైన రాజకీయ పరిస్థితులను చక్కదిద్డగలిగితే స్పష్టత వచ్చి తీరుతుంది. దానికోసం ఆ పార్టీలు కృషి చేయాలని ఆశిద్దాం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



