| << Newer | Older >> |
on 2008/10/13 3:56:25
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఒండించాలన్నదే అటు టి. డి. పి. , ఇటు పి. ఆర్. పి. ల లక్ష్యం , పట్టుదల. అలాంటపుడు రెండు పార్టీలు కలిసి పనిచేయకుండా టి. డి. పి. లేని కూటమితో కలుస్తామని పి. ఆర్. పి. బాహాటంగా చెబుతుంటే, టి. డి. పి. మాత్రం ఏమీ మాట్లాడకుండా వామపక్షాలను , టి., ఆర్. ఎస్. ను తన వైపు తిప్పు కొడానికి పట్టుదలతో కృషి చేస్తోంది. ఇంతకు పి. ఆర్. పి. తెలుగుదేశం పార్టీని అంతగా ద్వేషించడానికి అసలు కారణం ఏమిటి? అధికారాన్ని సమానంగా పంచుకోడానికి ముందుకు రావాలని సి. పి. ఐ. రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన ప్రతిపాదనను పి. ఆర్. పి. బహిరంగంగా ఎందుకు తిరస్కరించింది? చిరంజీవి తో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర రాజకీయాలను చిరంజీవి కి వదిలి, జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టాలని ప్రముఖ పత్రికాధిపతి చేసిన సూచనను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించారు? ఇంతకు ఆ ఇద్దరి నేతల ఆంతర్యం ఏమిటి అన్నది అందరికి కొంత వరకు ఈపాటికే అర్థం అయి ఉండవచ్చు. రాజకీయ పార్టీని ప్రకటించిన తరువాత చిరు అద్వానీల మధ్య ఫోన్ సంభాషణ నడిచింది. ఎవరు ఎవరికి ముందు ఫోన్ చేశారన్నది ముఖ్యం కాకపోయినా వారి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది వాస్తవమని అప్పట్లో తేలింది. పార్టీ పెట్టిన చిరు ను అద్వానీ అభినందించారని సమాచారం. ఆ తరువాత చంద్రబాబు, చిరు లు రహస్యంగా కలుసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దాన్ని చిరు ఖండించారు కూడా. తాను అన్ని పార్టీల ప్రధాన నేతలను కలిసి మాట్లాడుతానని అప్పట్లో చిరంజీవి చెప్పినా ఆది కార్య రూపం దాల్చలేదు. పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి ముఖ్యమంత్రి వై. ఎస్. ను మాత్రం అసలు కలవలేదు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు.
కాంగ్రెస్, టి. డి. పి. లకు తన ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయం అని చిరంజీవి బలంగా నమ్ముతున్నారు. పైగా రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి ముఖ్య మంత్రి గద్దె నెక్కాలన్న ఒక వజ్ర సంకల్పం తోనే చిరంజీవి పట్టుదలతో పార్టీని విజయపథం వైపు నడిపించడానికి కఠోర శ్రమకు కూడా సిద్దం అయ్యరన్నది ఆయన గత ఐదు రోజుల ఉత్తరంద్రా పర్యటన చెప్పకనే చెబుతోంది. తెలుగు దేశం తొమ్మిదేళ్ల పాలన, కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలన తో ప్రజలు విసిగి పోయారని కొత్తప్రభుత్వం కావాలని కోరుకోంటున్నారని చిరంజీవి నమ్ముతున్నారు. ప్రస్తుతం రాజకీయ శూన్యత చాలా ఎక్కువగా ఉందని అందువల్లనే ప్రజలు తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారని తన రోడ్ షో ప్రసంగాల్లో చిరంజీవి చెబుతూ వస్తున్నారు. 'మీ పిలుపు మేరకు వచ్చాను. నన్ను , నా పార్టీని గెలిపించుకునే భాద్యత మీదే' అన్న తీరులో చిరంజీవి ప్రసంగాలు సాగుతున్నాయి.
అధికారమే పరమాధిగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన ప్రసంగాలు చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి పై కన్నేసి ఉంచిన కారణంగానే ఆయన తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నారు. తనకు కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు ప్రధాన ప్రత్యర్థులని పి. ఆర్. పి. అధినేత వాదన. రాష్ట్రం లో పార్టీ పెట్టి తొలి ప్రయత్నం లోనే అధికారం లోకి రావాలని కలలు కంటున్న చిరంజీవి దాని సాకారం చేసుకోడానికి వామపక్షపార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సి. పి. ఐ. సానుకూలంగా ఉన్న సి. పి. ఎం. కు మాత్రం పి. ఆర్. పి. పై గురి కుదిరినట్లు కనిపించడం లేదు. శనివారం పి. ఆర్. పి. కోర్ కమిటీ లో కీలక సభ్యుడు అల్లు ఆరవింద్ డిల్లీ కి వెళ్ళి సి. పి. ఎం జాతీయ నేతలను కలిసినా వారి నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. అందుకే నేమో ఆదివారం చిరంజీవి తన విజయనగరం రోడ్ షో లో పరోక్షంగ సి. పి. ఎం. పై విరుచుకొని పడ్డారు. రానున్న ఎన్నికల్లో తన పార్టీ ని గెలిపించినట్లైతే, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారే తప్ప ప్రజా సమస్యలపై పోరాడుతానని కానీ ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని గాని పొరపాటున కూడా చెప్పడం లేదు. అమాయక , పేద ప్రజల నమ్మకాన్ని సొమ్ము చూకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చరేమో నని ఆయన రోడ్ షో ప్రసంగాలను వింటే అర్థం అవుతోంది. తనకు అధికారం కట్టబేడితేనే తాను ఏమైన చేస్తానన్న మాటలు ఆయన నోటి నుంచి వస్తున్నాయి. సంఘ సేవ, సమాజ సేవ చేసిన మహానుభావులు గాంధీ, జ్యోతిభా పూలే, మానవత వాది మదర్ థెరీసా ల చిత్ర పటాలను పెట్టి వారు తనకు స్పూర్తి ప్రదాతలని చిరు చెబుతున్నారు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారు సంఘాసేవ చేశారన్న విషయాన్ని చిరంజీవి గ్రహించాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



