| << Newer | Older >> |
on 2008/7/25 0:25:23
పార్లమెంట్‌ను కుదిపేసిన నోట్ల కట్టల వివాదం లో విచారణకు రంగం సిద్దం అయింది. ఈ వ్యవహారం పై స్పీకర్ సోమ్‌నాథ్ సూచన మేరకులోక్‌సభ సెక్రిట్రీయేట్ దర్యాప్తు చేపట్టనుంది. విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. కు అనుకూలంగా ఓటు వేయాలంటు తమకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి అడ్వాన్స్ గా అందిన ముడుకోట్ల రూపాయల ముడుపులు గురించి ముగ్గురు బి. జె. పి. లోక్‌సభ సభ్యులు డబ్బు సంచులను లోక్‌సభలో సాక్ష్యంగా చూపడం తెలిసిందే. ముడుపుల స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించిన సి. ఎన్. ఎన్., ఐ. బి. ఎస్. రికర్ చేసిన తాపేలాను లోక్‌సభ సెక్రిట్రీయేట్ పరిశీలిస్తోంది. ఆ టేప్ లో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ మాజీ సహాయకుడు సక్సేనా ఉన్నట్లు సమాచారం. వారిమధ్య నడిచిన సంభాషణ మాత్రం అర్థం కానీ విధంగా ఉందని తెలిసింది. ముగ్గురు ఎం. పి. లు పార్లమెంట్ కు అందజేసిన నోట్ల కట్టలు, సక్సేనా వద్ద ఆ ఎం. పి. లకు పుచుకున్న నోట్ల కట్టాలపై ఉన్నసీరియల్ నెంబర్‌లను లోక్‌సభ సెక్రిట్రీయేట్ తనికి చేయనుంది. సమగ్ర విచారణ జరిపి స్పీకర్‌కు ఒక నివేదిక
సమర్పించనుంది. ఎం. పి. లకు ముడుపులు ఆఫర్ చేసిన సంఘటన పై విచారణ జరపాలని బి. జె. పి. , వామపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




