| << Newer | Older >> |
on 2008/6/25 21:33:33
అణు ఒప్పందం విషయం లో యు. పి. ఏ. , లెఫ్ట్ ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అటు కాంగ్రెస్ , ఇటు లెఫ్ట్ కూడా ములాయం పై దృష్టి సారించాయి. అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ సహరించక పోయిన ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ ఒక వేళ లెఫ్ట్ తన మద్దతును ఉపసంహరించుకుంటే సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడా గట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం తో చర్చలు జరపాలని బావిస్తోంది. అయితే సి. పి. ఎం కు చెందిన ప్రకాష్ కారత్ కూడా సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ ను కలిసినట్లు తెలిసింది. అణు ఒప్పందాన్ని సి. పి. ఎం. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో ప్రకాష్ కారత్ ఆయనకు వివరించారని, యు. పి. ఏ. కు సహకరించరాదని పరోక్షంగా సూచించారనీ తెలిసింది. యు. పి. ఏ. కి యు. పి. ముఖ్య మంత్రి బి. ఎస్. పి. అధినేత్రి మాయావతి తన మద్దతును ఉపసంహరించింది. బి. ఎస్. పి. కి చెందిన 17 మంది ఎం. పి. లు మద్దతును ఉపసంహరించుకోవడం తో ప్రభుత్వం ఇరకాటం లో పడింది. అణు ఒప్పందం విషయం లో లెఫ్ట్ కూడా మద్దతు ఉపసంహరిస్తే ముందస్తు తప్పదు. ముందస్తుకు యు. పి. ఏ. కూటమి లోని చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తన ప్రత్యర్థి మాయావతి యు. పి. ఏ. కి మద్దతు ఉపసంహరించుకోవడం తో ములాయం చూపు యు. పి. ఏ పై పడింది. యు పి. ఏ . తో కలిసి మాయావతి ని ఇబ్బందుల పాలు చేయాలని , రాష్ట్ర రాజకీయాల్లో మాయావాతిని ఒంటరీని చేయాలని ములాయం యోచన. ములాయం ఆలోచన బాగున్నా ఆయన తన కూటమి తో చర్చించి నిర్ణయించుకోవాలి. ముందుగా సి. పి. ఎం. ములాయంసింగ్ ను కలవడం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్, సి. పి. ఎం. లలో ములాయం సింగ్ ఎవరి వైపు మొగ్గుతారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



