| << Newer | Older >> |
on 2008/7/21 23:37:26
మరి కొన్ని గంటల్లో లోక్‌సభ లో ప్రధాని మన్మోహన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న ఓటింగ్ తో యు. పి. ఎ.ప్రభుత్వ భవితవ్యం తెలిపోనుంది. విశ్వాస పరీక్షలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవక్షాలు ఉన్నాయి. తమ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ కు పాల్పడే రెబల్స్ పై వేటు వేయాలని బి. జె. పి. స్పీకర్ ను కోరింది. యు. పి.ఎ.కు అనుకూలంగా ఓటు వేయాలని ఇప్పటికే నరేంద్ర నిర్ణయించుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా యు.పి. ఎ.కు అనుకూలంగా ఓటు వేయనుంది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్.పి.లను తన వైపు తిప్పుకోడానికి బి. ఎస్.పి. పావులు కదుపుతోంది. డిల్లీ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. సమీకరణాలు గంట గంట కు మారుతున్నాయి. విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. బైట పడుతుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




