| << Newer | Older >> |
on 2008/7/23 22:52:50
రాజకీయాల్లో విలువలు ఎప్పుడో అంతరించాయి. విలువల వలువ లుడ్చడమే నేటి రాజకీయం. రాజకీయాలు కుళ్ళి కంపు కొడుతున్నాయి. నైతిక విలువలు ఏ నాడో అటకెక్కాయి. ఇప్పుడంత స్వార్థ రాజకీయాలే తప్ప మరేమీ కనిపించదు. వినిపించదు. జాతికి ఆదర్శంగా నిలవాలన్న సామాజిక స్పృహ నేటి రాజకీయ నేతల్లో కొవ్వత్తి వెలిగించి గాలించినా ఈసుమంతా కూడా కనిపించదు. దేశానికి నాయకత్వం వహించాల్సిన నేతలు అందరికి ఆదర్శంగా నిలవాలి. ప్రజల మెప్పు పొందడానికి నీతి, నిజాయితీగా మసలు కోవాలి. ప్రస్తుతం రాజకీయనేతలను చూస్తుంటే ఇవేవీ కనిపించవు. అధికారమే పరమావదిగా స్వార్థమే ఉపిరిగా కొనసాగుతుండటం సిగ్గుచేటు. నేటి నేతలకు ముఖ్యమైనది తమ పంతాన్ని నెగ్గించుకోవడమే దానికి గాను ఎంత కైనా తెగిస్తారు. ఏమైన చేస్తారు. ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేవు. ప్రభుత్వాన్ని ఎలాగైనా నిలుపుకోవాలన్న తపన అధికార కూటమి దైతే, ప్రభుత్వ పతనమే తమ ధేయమన్న పంతం విపక్షానిది. ఇక అధికార కూటమి కి అండగా నిలవడం ద్వారా తమ సొంత ప్రయోజనాలను పరిరక్షించుకోవడం మరో పార్టీ ఆలోచంగా కనిపించింది. ఇంతే తప్ప దేశం గురించి, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల గురించి ఏ పార్టీ గానే ఏ పార్టీ నేత గాని ఆలోచించడం లేదు. ప్రజలు తమ ను గమనిస్తున్నారన్న భయం నేతలకు అసలు లేదు. సంతలో పశువులను కొన్నంత సులువుగా రాజకీయ నాయకులు అమ్ముడు పోవడం ఈ దేశ నికి పట్టిన చీడ అని చెప్పాలి. నవ్వీపోడూరుగని నాకేంటి సిగ్గు ఆన్ తీరులో ప్రజాప్రతినీడులు సిగ్గు, ఎగ్గు లేకుండా ముడుపులకు లొంగి పోతున్నారు. ఇంతకన్నా దౌర్బాగ్యం , దివాళకోరుతనం మరెక్కడైన ఉందా! అణు ఒప్పందం వల్ల దేశానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఏ రాజకీయ నేతాయినా ఒక్క నిమిషం స్మితీతంగా ఆలోచించాడా? అబ్బే అసలు ఆ యూస్ లేదు. మనకు దాని గురించే తెలుస్తే కదా ఆలోచించడానికి. తెలుసుకోవాలన్న తపన కూడా లేదు. డబ్బుకట్టాలపై ఉన్న మమకరంలో అవాగింజంత దేశ భద్రతపై ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపాడి ఉండేది. దేశాన్ని ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తల దించుకునేలా చేసిన మన నేతలను ఎం చేసిన పాపం లేదు. కాదంటారా
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



