| << Newer | Older >> |
on 2008/7/18 18:55:22
తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆత్మ వంచన చేసుకోలేకనే తాను ఆ పార్టీని వదిలి బైటకు వచ్చానని మాజీ మంత్రి, రాజ్య సభ సభ్యుడు రామచంద్ర య్య అంటున్నారు. ఎన్. టి. ఆర్. ఆశయాలను చంద్రబాబు విస్మరించారని తన సొంత అజెండా ను రూపొందించుకొని ఏకపక్ష నిర్ణయలతో వ్యవహరించడం తో తాను చాలా కలత చెందినట్లు చెప్పారు. మంచి మిత్రుడు, పార్టీ నాయకుడు అయిన చంద్రబాబు తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని సిద్దాంత పరమైన విభేదాలె తాను పార్టీని వదలడానికి కారణ మని చెబుతున్నారు. ఎన్. టి. అర్ హాయాంలో ఉన్న విలువలు ఇపుడు పార్టీలో లేవని మరో మాజీ ఎం. ఎల్. ఏ. డాక్టర్ ఎం. వి. రమణారెడ్డి కూడా అన్నారు. ఆయన కూడా రామచంద్ర య్య తో పాటు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో స్వార్థ రాజకీయం పెరిగిందని, కేవలం వై. ఎస్. ను దూషించే వారికే పార్టీ కార్యాలయం లో ప్రాధాన్యత ఇస్తున్నారని రమణారెడ్డి చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




