| << Newer | Older >> |
on 2008/7/18 5:20:03
విశ్వాస పరీక్షలో తన ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవాలన్న తపన ప్రధానిలో మొదలైంది. నిన్నటిదాకా యు. పి. ఏ. అన్ని చూసుకుంటుందన్న నమ్మకం తో ఉన్న మన్మోహన్‌కు ఇపుడు వాస్తవ పరిస్థితి అవగతమైంది. ఇక తానే రంగం లోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే మాజీ ప్రధాని దేవెగౌడ కు ఫోన్ చేశారు. తన ప్రభుత్వాన్ని ఆడుకోవాలని తన పరువు కాపాడాలని కోరారు. ఈనెల 22 న ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విశ్వాస పరీక్ష లో జనతాదళ్(ఎస్) పార్టీ నేత దేవెగౌడ ఆదుకుంటారని ప్రధాని కొండంత ఆశతో ఉన్నారు. ఇక అక్కడ దేవెగౌడ్ కూడా మన్మోహన్ కోరిక గురించి ఆలోచిస్తున్నారు. యు. పి. ఏ. కు. మద్దత్తు ఇవ్వాలంటే ఆయన తన డిమాండ్ల చిట్టా ను విప్పాలనీ అనుకుంటున్నారు. బి. జె. పి. కర్నాటక లో పాగా వేసిన తరుణంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తును కోరుతున్నారు. ఆది చాలా చిన్న డిమాండ్ కాబ్బట్టి కాంగ్రెస్ కు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. కర్నాటక లోని బళ్ళారి ప్రాంత ఇనుప ఖనిజ గనుల మాఫియా కీలక పాత్ర పోషించడం తో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దారుణంగా ఓటమి పలు కావడం తో ఇనుప ఖనిజాలను జాతియం చేయాలన్న దేవెగౌడ్ డిమాండ్ తీర్చాలంటే మాత్రం కాంగ్రెస్ కు చాలా కష్టమనే చెప్పాలి. కర్ణాటకలో బి. జె. పి. బలపడకుండా చూడాలంటే దేవెగౌడ్ కాంగ్రెస్ తో సయోధ్య కోరుకోవడం కన్నా మరే అవకాశం లేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




